Advertisement
ఇండియన్ ఆర్మీలో ఎక్కువగా పంజాబ్ వాసుల పేర్లే వినిపిస్తుంటాయి! సిపాయి నుండి బ్రిగేడియర్ స్థాయి వరకు మిలటరీలో వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.! ఆర్మీలో చేరడాన్ని పంజాబ్ వాసులు గర్వంగా ఫీల్ అవుతారు…వారి తల్లిదండ్రులు… సద్దా పుత్తా ఫౌజీ హై ( నా కొడుకు ఆర్మీలో ఉన్నాడు ) అని గర్వంగా చెప్పుకుంటారు! చిన్నప్పటి నుండే ఆర్మీ మీద అవగాహన ఎక్కువగా ఉండడం, శారీరకంగా బలంగా ఉండడం కూడా పంజాబ్ వాసులు ఆర్మీలో ఎక్కువగా ఉండడానికి ఒక కారణం.
వాస్తవానికి ఇండియన్ ఆర్మీలో పంజాబ్ వాళ్ల కంటే ఉత్తర ప్రదేశ్ వాళ్లు ఎక్కువగా ఉంటారు! కానీ జనాభా దృష్ట్యా చూస్తే …చిన్న రాష్ట్రమైన పంజాబ్ నుండి 11.7 శాతం మంది ఇండియన్ ఆర్మీలో ఉన్నారు.
Advertisement
ఏ రాష్ట్రం నుండి ఇండియన్ ఆర్మీలో ఎంత శాతం ఉన్నారు?
- 1. U.P నుండి 14 %.
- 2. మహారాష్ట్ర 13.4%.
- 3.తమిళనాడు 12%.
- 4. పంజాబ్. 11.7%.
- 5. హర్యానా 11%.
Advertisements
ఇంకో కారణం ఏంటంటే…. సింగ్ పేరుతో ఉత్తర ప్రదేశ్ , పంజాబ్ , హర్యానాలో కూడా కొన్ని ఇంటి పేర్లు ఉండడంతో….. ఆర్మీలో మనకు ఎక్కువగా వినిపించే సింగ్ పదాన్ని బట్టి మనం వారిని పంజాబ్ లెక్కలో వేస్తాం….సో ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చు..కానీ సిక్కులకు దేశ భక్తి, ఆత్మగౌరవం ఎక్కువ అనేది మాత్రం అందరం అంగీకరించాల్సిన అంశం.
Advertisements