Advertisement
” నేను 9 వ తరగతిలో ఉన్నప్పుడు స్కూల్ బస్ స్టాప్ లో అతను పరిచయం అయ్యాడు..మా సీనియర్ తను.. మెయిల్ ఐడిలు షేర్ చేసుకుని జిమెయిల్ లో ఛాటింగ్ చేసుకునేవాళ్లం.. ఫేస్ బుక్ లో అకౌంట్ ఓపెన్ చేసిన కొత్తలో తన నుండి రిక్వెస్ట్ వచ్చింది..ఏదో సంతోషం..వెంటనే యాక్సెప్ట్ చేసా..అప్పటి నుండి ఎక్కువగా ఆన్లైన్ లోనే ఉండేవాళ్లం..అతని మాటల వల్ల తను నన్ను ఇష్టపడుతున్నాడని అర్దం అయింది.తనతో ఎక్కువగా ఛాట్ చేస్తుండడంతో నేను కూడా తనని ఇష్టపడుతున్నా అని అతను అనుకున్నాడు”.
“మేము అంతసేపు మాట్లాడుకుంటున్నా..అతని పట్ల నా ఫీలింగ్స్ ఏంటో నాకు అర్దమయ్యేవి కాదు..అవి అతనితో చెప్పడానికి ప్రయత్నించినా చెప్పలేకపోయేదాన్ని..సడన్ గా ఒకరోజు ముంబాయ్ నుండి షిప్ట్ అవుతున్నాం అనే విషయాన్ని చెప్పాడు వాళ్లనాన్న… మాకు ఉన్న గడువు కేవలం రెండు వారాలు మాత్రమే.. ఆ రెండు వారాల సమయాన్ని వృధా చేయకూడదనుకున్నాం.. పూర్తిగా మాదైన లోకంలో బతికాం..అప్పుడే నాకు అర్దం అయింది తనపై నాకున్నది ప్రేమని.. అప్పుడు మా వయసు 16ఏళ్లు.
అతను నన్నొదిలి ఉండలేడని నాకు అర్దం అయింది..బెంగళూర్ కి షిప్ట్ అవ్వడానికి ముందే ఇక్కడ వేరే హాస్టల్ కి అప్లై చేసుకుని వెళ్లాడు..హాస్టల్ సీట్ రాగానే ముంబాయ్ వచ్చేశాడు..కానీ హాస్టల్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉండేవి..నో ఫోన్, నో అవుటింగ్.. దాంతో నేను వాళ్ల మదర్ లా హాస్టల్ కి కాల్ చేసేదాన్ని, బయటికి పంపమని అడిగేదాన్ని అలా ప్రతి నెల ఇద్దరం పాత పుస్తకాల షాప్లో కలిసి, పక్కనఉన్న సరస్సు వెంబడి కొంత దూరం నడిచేవాళ్లం..తర్వాత తను హాస్టల్ కి వెళ్లిపోయేవాడు..తర్వాత మేం ఒకే కాలేజ్లో జాయిన్ అయ్యాము, క్యాంపస్ ఇంటర్వ్యూలో ఇద్దరికి ఒకే కంపెనీలో కూడా ఉద్యోగం వచ్చింది.
ఒక రోజు మేం కలిసి ఉండగా సడన్ గా రోహన్ కి మూర్ఛ వచ్చింది..నాకైతే నా కళ్లముందు అతడు చనిపోతున్నట్టుగా అనిపించింది..అతికష్టమ్మీద హాస్పిటల్ కి తీస్కెళ్ళా.. బ్రెయిన్ ట్యూమర్ అని తెలిసింది..అప్పుడు అతని వయసు 20ఏళ్లు మాత్రమే…అప్పటి నుండి మా జీవితం అంతా మసకబారినట్టుగా ఉంది..కళ్లముందు సంతోషం అంతా ఆ ఒక్క సంఘటనతో మాయమైంది..సరైన వైద్యం అందించకపోతే పక్షవాతానికి గురవుతాడని చెప్పారు..తర్వాత కొన్ని నెలలకు అతని సర్జరీ జరిగింది. సుమారు ఆరుగంటల పాటు జరిగింది ఆ సర్జరీ.. ఆ ఆరు గంటలు నా జీవితంలో అత్యంత భయంకరమైనవి..ఒక మనిషిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తే..ప్రాణాలకోసం పోరాడే ప్రేమికుడి విలువ, అతడి ప్రేమ విలువ తెలుస్తుంది.. నా ప్రాణం పోతున్నట్టుగా అనిపించింది.
Advertisements
Advertisement
Advertisements
ఆరుగంటల తర్వాత డాక్టర్ బయటకి వచ్చి ఆపరేషన్ సక్సెస్ అని చెప్పినప్పుడు నా కళ్ల వెంట నీరు నాకు తెలియకుండానే ఉబికివస్తుంది..ఆ నిమిషం అర్దం అయింది..జీవితం చాలా విలువైనదని, బతికి ఉన్న ప్రతి నిమిషం సంతోషంగా బతకాలని అప్పుడు మేము 21,22 ఏజ్ లో ఉన్నాము.
వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాను ..రోహన్ ని పెళ్లి చేసుకోవాలని..నా కుటుంబం, నాఫ్రెండ్స్ అందరూ నో చెప్పారు..తనని చేసుకుంటే జీవితాంతం తనకి సేవలు చేస్తూ నర్సుగా అయినా బతకాలి,లేదంటే విదవరాలిగానైనా అంటూ ఏవేవో మాటలు అన్నారు. ఆఖరికి రోహన్ కూడా ఒప్పుకోలేదు..తనని చేసుకుని నేను ఇబ్బంది పడడం తనకి ఇష్టం లేక..కానీ వేరొకరితో జీవితాంతం బతికేకంటే తనతో నాలుగు నెలలు బతికినా చాలనుకున్నాను..మా వివాహం జరిగింది.
పెళ్లయిన నెల తరువాత, అతనికి మళ్ళీ మూర్ఛ వచ్చింది- మునుపటి కంటే మూడు రెట్లు ఎక్కువగా బ్రెయిన్లో ట్యూమర్ పెరిగింది…లెక్కలేనంత మంది డాక్టర్లను కలిసాము,ఎన్నో పరీక్షలు చేయించాము.కానీ ఫలితం శూన్యం..ప్రతిది సరదాగా తీసుకునే రోహన్ ఫారిన్ హాస్పిటల్స్ పేరుతో అయినా మన హనీమూన్ కంప్లీట్ చేద్దాం అనేవాడు..ఎన్నో రాత్రులు అతని పేషెంట్ బెడ్ పైనే గడిచాయి..ప్రతి క్షణం భయంభయంగానే గడిచింది.
చివరిగా ఒకసారి ట్యూమర్ ని కుదించే(పెరగకుండా ఆపే) ట్రీట్మెంట్ తీసుకున్నాడు.. కణితి పెరగడం ఆగి రెండు సంవత్సరాలయింది.. ఒకరోజు ఉదయం హాస్పిటల్ కి వెళ్లి టెస్ట్ చేయించుకుంటే..డాక్టర్ ఏం చెప్తారా అని గుండె వేగంగా కొట్టుకోసాగింది.. ట్యూమర్ పూర్తిగా నయమైపోయిందని చెప్పడంతో నా ఆనందానికి అవధులు లేవు.ఏళ్ల తరబడి అనుభవించిన బాధకి ఆ ఒక్క మాటతో గుండె నార్మల్ గా కొట్టుకున్నట్టనిపించింది..
ఇప్పుడు నేను రోహన్ మాకు ఇష్టమైన పిజ్జా తింటూ మరియు నెట్‌ఫ్లిక్స్ లో సిరీస్ లు చూస్తూ మా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాము..మాతోపాటు మా చిన్న ఇంట్లో 2 బుజ్జి పిల్లిపిల్లలు..నేనిప్పుడు రోహన్ తో జీవితాంతం ఉండొచ్చు..ఇప్పుడు నేను అనుభవించే సంతోషం వెనుక ఎంతో నరకం ఉంది..అందుకే ప్రతి నిమిషాన్ని సంతోషంగా గడపాలనుకుంటున్నాను..నా రోహన్ తో..!