Advertisement
నా పేరు పుతుల్…ఫోటోలో నవ్వుతూ కనిపిస్తున్నది నేనే! నిజానికి ఆ నవ్వు కేవలం ఫోటోకే పరిమితం నా జీవితం మాత్రం దుఖమయం. సింపుల్ గా చెప్పాలంటే పూల పాన్పులు నిద్రలేని రాత్రులు.! ఇదే నా జీవితం…ఎందుకంటే నేనో వేశ్యను .! మా అమ్మ నన్ను ఇక్కడ అమ్మేసి నేనిటి 10 సంవత్సరాలు!
కరెంట్ లేని మా ఇంట్లో నేను అమ్మ చెల్లి ఉండే వాళ్లాం… నా చెల్లికి చీకటంటే భయం..అందుకే దైర్యం కోసం రాత్రులు నా జుట్టును పట్టుకొని పడుకునేది….ఇప్పుడు ఆ భయం పోయి ఉంటుంది ! నా తమ్ముడు మా ఇంటికి కరెంట్ కనెక్షన్ ఇప్పించుంటాడు. నన్ను ఇక్కడ వచ్చిన డబ్బులతో.. వాళ్లంతా హ్యాపీగా ఉండి ఉంటారు.!
Advertisement
అప్పుడప్పుడు మట్టివాసన వచ్చే మా ఇల్లు నాకు గుర్తొస్తుంటుంది. రాత్రులు సుగంధాలను వెదజల్లిన మా ఇంటి ముందటి బొండుమల్లె చెట్టు గుర్తుకొస్తుంటుంది. కానీ …నా దగ్గరకొచ్చే వాళ్లు కొట్టుకొచ్చే ఖరీదైన ఫర్ ఫ్యూమ్ వాసనలకు ….ఆ వాసనలు దూరంగా వెళ్లిపోతుంటాయి.! రెండు ఒక చోట ఇమడలేవు కదా.! ఇప్పుడు నా జీవితం అంతా హోటల్స్ నుండి పార్సిల్లు…..పూల పాన్పులు… కరెన్సీ నోట్ల బేరాల చుట్టే తిరుగుతుంది !
Advertisements