Advertisement
చాలా మందికి పాము పేరు వెంటే చాలు గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. పాములను చూస్తే వాళ్ళ గుండె ఆగిపోయినా ఆశ్చర్యం లేదు. ఇక కొండచిలువ లాంటి భారీ సర్పాలను చూస్తే…? ఇక అది మింగేస్తుంది తినేస్తుంది అంటూ కంగారు పడుతూ ఉంటారు. నిజంగా అవి మనుషులను మింగుతాయా అంటే చాలా మందికి తెలియదు.
Also Read:మహిళలకు తక్కువ పెట్టుబడిలో బెస్ట్ బిజినెస్…?
అవి కచ్చితంగా మింగే ఛాన్స్ లేదు. కాని చిన్న పిల్లల్ని మాత్రం మింగేస్తాయి. హాలీవుడ్ సినిమాలు చూసిన వాళ్ళు మాత్రమే అనుకుంటారు అవి మింగేస్తాయి అని. అలానే గ్రేట్ ఆఫ్రికన్ రాక్ పైథాన్ ఖచ్చితంగా మ్రింగగలదు అని నమ్మే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కచ్చితంగా డిస్కవరీ ఛానల్ చూసే బ్యాచ్. అవి పదేళ్ల లోపు పిల్లలను మాత్రమే మింగే అవకాశం ఉంటుంది. అయితే రిటైక్యులేటెడ్ పైథాన్ మాత్రం మిగతా అన్నింటిలోకీ పెద్ద కొండచిలువ జాతి.
Advertisement
ప్రపంచంలోనే అతిపెద్ద పాము అది. ఏ కొండచిలువైనా ఐదారేళ్ళ పిల్లల్ని అయితే తేలిగ్గా మ్రింగేయగలదు. ఇవి సాధారణంగా గొఱ్ఱెలను,మేకలను,దుప్పిలను మాత్రమే. అదే పరిమాణంలో మనిషి కనపడినా సరే తినేస్తూ ఉంటాయి. అయితే ఇప్పటి వరకు అవి మనిషిని మింగిన చరిత్ర లేదు గాని… ఇండోనేషియాలో మాత్రం మింగిన ఘటన జరిగింది.
Advertisements
ఇండోనేషియాలో రిటైక్యులేటెడ్ పైథాన్ ఓ పాతికేళ్ళ రైతుని రెండు నిమిషాల్లో చంపింది గాని మ్రింగింది గాని ఎన్నో గంటల సమయం తీసుకుంది. ఆ తర్వాత దాన్ని కోసి శవం బయటకు తీసారు. వాటి పళ్ళు మాత్రం రేగి ముళ్ళు మాదిరి ఉండి… గుచ్చుకున్న తర్వాత బయటకు తీసే ప్రయత్నం చేస్తే చీరేస్తాయి.
Advertisements