Advertisement
1631, 1831, 1903, 1908 సంవత్సరాల్లో భారీ వరదలు, వ్యాధులు హైదరాబాద్ నగర ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. 1911లో కలరా మహమ్మారి జనాలను మరింతగా భయపెట్టింది. ఆ తర్వాత కొద్ది కాలానికే మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం ప్రపంచవ్యాప్తంగాఇన్ ఫ్లూ ఎంజా వ్యాధి ప్రబలింది. 1919లో ఫ్లూతో కొన్నివందల మంది మంచం పట్టారు.ఇవి అంటు వ్యాధులు కావడంతో ఎక్కువ మంది జనాలు గుంపులు గుంపులుగా ఉండకుండా ఆనాటి పాలకులు చర్యలు తీసుకున్నారు
అందులో భాగంగా నగర రక్షణ కోసం…. రెండో నిజాం నిజాం అలీఖాన్ నగరం చుట్టూ 12 దర్వాజాలతో ప్రహరీ కట్టారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు రాకపోకల కోసం దర్వాజాలు తెరిచి రాత్రి వేళల్లో దర్వాజాలు మూసివేసేవారు. ఇలా నగరంలో అంటు వ్యాధులు ప్రబలినప్పుడు నగర దర్వాజాలు మూసి వేసేవారు. నగర ప్రజలను వేరే ప్రాంతాలకు వెళ్లనిచ్చే వారు కాదు, వేరే ప్రాంతాల వారిని నగరంలోకి రానిచ్చేవారు కాదు. ఫలితంగా రోగాలు తగ్గుముఖం పట్టేవి.
వ్యాధులకు గురయిన వారిని దారుల్ షిఫా ఆసుపత్రికి తరలించి చికిత్స చేసేవారు. ఈ నివారణ, చికిత్స కోసం 1915 లో నగరానికి దూరంగా ఈరన్నగుట్ట దగ్గర ఒక చిన్నపాటి ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ఇలా ఆ రోగుల నుంచి ఇతరులకు రోగాలు సోకకుండా ఆయా రోగులను క్వారంటైన్ లో ఉంచే పద్దతిని మన హైదరాబాద్ నగరంలో వందేళ్ల క్రితమే Quarantine Hospital (క్వారంటైన్ హాస్పిటల్ ) అనే పేరుతో ప్రారంభించారు. అలా దేశంలో మొదటి క్వారంటైన్ ఆసుపత్రి ప్రారంభమైంది. కాలక్రమేణా ఇది ‘కోరంటి’ హాస్పిటల్ గా ప్రసిద్ధి చెందింది.
సేకరణ: అరవింద్ ఆర్య.
photos :
1. దారుషిఫా’ యునాని ఆస్పత్రి:
Advertisements
Advertisement
2. ‘కోరంటి’ హాస్పిటల్
3. చార్మినార్
5. Endemic Zones of Hyderabad Map
6. Plague Mortality Map .
7. వందేళ్ల క్రితం నాటి హైదరాబాద్ లో ఆసుపత్రుల మ్యాపు
8. కుష్టు వ్యాధి నివారణ కేంద్రాలు .
Advertisements