Advertisement
ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన రైల్వే వ్యవస్థ మనది. భారతీయ రైల్వే ప్రపంచంలోనే పెద్దదైన రైల్వే వ్యవస్థగా పేరుగాంచింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా మొత్తం 1.23 లక్షల కిలోమీటర్ల రైలు మార్గం విస్తరించి ఉంది. అయితే అన్ని కిలోమీటర్ల రైలు పట్టాలను నిత్యం తనిఖీ చేయాలంటే సవాల్‌తో కూడుకున్న పనే. దీంతో ఆ పనిని సులభతరం చేసేందుకు పలు యంత్రాలు ఇప్పటికే రైల్వే వద్ద అందుబాటులో ఉన్నాయి. అయితే అవన్నీ చాలా ఖరీదైనవి. అలాగే వాటిని ఒక చోట నుంచి మరొక చోటుకు తీసుకువెళ్లడం కూడా చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ క్రమంలో ఈ ఇబ్బందులన్నింటినీ అధిగమిస్తూ.. ఓ రైల్వే అధికారి వినూత్న రీతిలో నూతనంగా ఓ సైకిల్‌ను ఆవిష్కరించాడు.
వెస్ట్ అజ్మీర్ రైల్వే విభాగంలో సీనియర్ డెన్‌గా విధులు నిర్వర్తిస్తున్న పంకజ్ సాయిన్ చాలా తక్కువ బరువు ఉండే లైట్ వెయిట్ రైల్వే బైసైకిల్‌ను ఆవిష్కరించాడు. త్రిభుజాకారం వచ్చేలా సైకిల్‌ను తీర్చిదిద్దాడు. దానికి వెనుక చక్రానికి రెండు పైపులను అమర్చి వాటిని మరొక పట్టాపై ఫిక్స్ అయ్యేలా చక్రాలను అమర్చాడు. ముందు చక్రానికి ముందు వైపుకు వచ్చేలా మరో రెండు చిన్న పైపులను అమర్చి వాటిని మళ్లీ వీల్స్‌కు జత చేశాడు. దీంతో సైకిల్ రెండు రైలు పట్టాలపై బ్యాలెన్స్ అవుతుంది.
Advertisement
సదరు రైల్వే బైసైకిల్ కేవలం 20కేజీల బరువు మాత్రమే కలిగి ఉంటుంది. సాధారణ సైకిల్‌ను రూ.5వేల ఖర్చుతో ఆ సైకిల్‌గా మార్చవచ్చు. తక్కువ బరువు ఉండడం వల్ల ఒక మనిషి ఈ సైకిల్‌ను సులభంగా రైల్వే ట్రాక్‌పైకి ఎత్తి పెట్టవచ్చు. ట్రాక్ పై నుంచి కిందకు ఆ సైకిల్‌ను తీసుకెళ్లవచ్చు. ఈ సైకిల్‌పై ఇద్దరు వ్యక్తులు ప్రయాణించవచ్చు. గంటకు 10 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో ఈ సైకిల్‌పై వెళ్లవచ్చు. దీన్ని సులభంగా ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లవచ్చు. ధర కూడా తక్కువ. పైగా లైన్‌మెన్ సులభంగా ఈ సైకిల్ ద్వారా ప్రయాణించి రైల్వే ట్రాక్స్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయవచ్చు. అత్యవసర సమయాల్లో రైల్వే యంత్రాలు వచ్చి పట్టాలను తనిఖీ చేసేందుకు టైం పడుతుంది కనుక.. ఈ సైకిళ్లను ఉపయోగించి వెంటనే ట్రాక్స్‌ను తనిఖీ చేయవచ్చు. దీంతో ఎంతో సమయం ఆదా అవుతుంది.
Advertisements
Advertisements
రైల్వే సైకిల్ వల్ల.. చెడిపోయిన ట్రాక్స్‌ను.. వర్షాకాలంలో బ్రిడ్జిలపై ట్రాక్స్ పనితీరును పరిశీలించాలన్నా.. నిత్యం ట్రాక్‌లను తనిఖీ చేయాలన్నా చాలా సులభతరమవుతుంది. లైన్‌మెన్ చాలా వేగంగా సంఘటనా స్థలానికి వెళ్లి పట్టాలను పరిశీలించవచ్చు. అయితే ఈ సైకిల్ వల్ల ఇన్ని లాభాలు ఉన్నప్పటికీ ఒకే ఒక్క నష్టం ఉంది. అదేమిటంటే… సాధారణంగా ట్రాక్స్ తనిఖీ చేసే యంత్రాలకు ట్రేసింగ్ సిస్టం ఉంటుంది. అంటే రైలు పట్టాలపై సదరు యంత్రాలు ఉంటే రైల్వే స్టేషన్లలోని వారికి, రైళ్లలో వాటిని నడిపే వారికి ఆ యంత్రాలు ఎక్కడున్నాయో తెలుస్తుంది. దీంతో ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. కానీ రైల్ సైకిల్‌కు ట్రేసింగ్ సిస్టం ఉండదు. అందువల్ల లైన్‌మెన్లు దానిపై ఉంటే వారికి ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే దీన్ని కూడా అధిగమించేలా మార్పులు, చేర్పులు చేస్తే రైల్ సైకిల్ వల్ల ఎంతో లాభం ఉంటుంది. రైలు పట్టాలను ఎప్పటికప్పుడు వేగంగా తనిఖీలు చేసేందుకు అవకాశం ఉంటుంది.