Advertisement
కథ విషయంలోనే కాదు..అందులో క్యారెక్టర్స్ తగ్గట్టుగా నటుల ఎంపిక విషయంలో కూడా దర్శకధీరుడు రాజమౌళిది విభిన్నశైలి.. నాయకులకు తగ్గట్టుగా ప్రతినాయకులను సెలక్ట్ చేయడంలో జక్కన్న దిట్ట.. జక్కన్న పరిచయం చేసిన కొందరు విలన్స్ ఎవరో చూద్దాం.
ప్రదీప్ రావత్
బాలివుడ్ నటుడు ప్రదీప్ రావత్ ని “ సై ” సినిమాలో భిక్షూ యాదవ్ గా పరిచయం చేశాడు జక్కన్న..ఆ సినిమాలో తన ఆహార్యం చూస్తేనే భయపడేలా చేయగలిగాడు..సై తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా దక్షిణాదిలో దూసుకెళ్లాడు.. విలన్ రోల్స్ తో భయపెట్టిన ప్రదీప్ రావత్ తర్వాత కమెడియన్ గా కూడా నవ్వించాడు.
దేవ్ గిల్
Advertisements
రాంచరణ్ కి మగధీర లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన జక్కన్న..అదే సినిమాతో దేవ్ గిల్ ని విలన్ గా పరిచయం చేశాడు.బాలివుడ్ కి చెందిన దేవ్ గిల్ కృష్ణార్జున సినిమాతో తెలుగులోకిప్రవేశించినప్పటికి, మగధీర సినిమాలో రణదేవ్ బిల్లా పాత్ర తర్వాత టాప్ రేంజ్ కి వెళ్లిపోయాడు..
సుదీప్
కన్నడ నటుడు సుదీప్ ని ఈగ సినిమాతో తెలుగు వారికి పరిచయం చేశాడు రాజమౌళి..సుదీప్ కేవలం నటుడు మాత్రమే కాదు డైరెక్టర్,ప్రొడ్యుసర్,సింగర్..హోస్ట్ ..
అజయ్
సీరియల్స్ తో కెరీర్ ప్రారంభించిన అజయ్ తర్వాత హీరో ఫ్రెండ్ గా,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డాడు..ఒకట్రెండు సినిమాల్లో హీరోగా నటించాడు.. అన్ని పాత్రల్లోకెల్లా విక్రమార్కుడు సినిమాలోటిట్లా క్యారెక్టర్ అజయ్ కి బాగా పేరు తీసుకొచ్చింది..ఆ పాత్రకి తను తప్ప మరొకరు సూట్ కారు అన్నట్టుగా నటించి మెప్పించాడు అజయ్.
Advertisement
నాగినీడు :
మర్యాద రామన్న సినిమాలో రాజమౌళి పరిచయం చేసిన మరో విలన్….నాగినీడు.!
సుప్రీత్
సుప్రీత్ ఎన్ని సినిమాల్లో నటించిన ఛత్రపతి సినిమాలో కాట్రాజ్ పాత్రే ఎక్కువగా గుర్తుంటుంది..నిజానికి ఆ సినిమాలో ప్రభాస్ కి స్నేహితుడి పాత్రకు సుప్రీత్ ని ముందు సెలక్ట్ చేశాడు రాజమౌళి.కానీ తర్వాత కాట్రాజ్ పాత్రకి షిప్ట్ చేశాడు..సై,మర్యాదరామన్న రాజమౌలి దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో నటించాడు.
ప్రభాకర్
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న ప్రభాకర్ కి తన సినిమాల్లో మెయిన్ విలన్ రోల్స్ ఇచ్చి ప్రోత్సహించాడు రాజమౌళి.. మర్యాదరామన్న సినిమాలో తొలిసారి రాజమౌళి దర్శకత్వంలో నటించిన ప్రభాకర్.. బాహుబలి సినిమాలో కాలకేయ ఛాన్స్ కొట్టేశాడు.. ఆ పాత్ర ప్రభాకర్ కి చాలా గుర్తింపు తీసుకొచ్చింది.
రానా
నటుడు రానాని బాహుబలి 2 లో నెగటివ్ రోల్ కి సెలక్ట్ చేశాడు.. బల్లాల దేవగా ప్రభాస్ తో పోటీపడి నటించాడు రానా.
Advertisements