Advertisement
ముత్యాల సుబ్బయ్య….. తెలుగులో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న దర్శకుడు. 50 సినిమాలు చేస్తే దాదాపు 40 కి పైగా హిట్టులే…పైగా రాజశేఖర్, వెంకటేష్, చిరంజీవిలకు మర్చిపోలేని సూపర్ హిట్లు ఇచ్చాడు. ప్రత్యేకంగా ఈయన డైరెక్షన్ లో రాజశేఖర్ చేసిన ప్రతిసినిమా హిట్ అయ్యింది. వీరి కాంబోలో వచ్చిన సినిమాలేవి , వాటి విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
అరుణకిరణం ( హిట్ ):
ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా 1985లో విడుదలైన ఈ సినిమా 150 రోజులు ఆడింది. మైనంపాటి భాస్కర్ రాసిన వెన్నెల మెట్లు అనే నవల ఆధారంగా ఈ సినిమాను తీశారు.
ఇదాప్రపంచం: హిట్
Advertisements
ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో 1987 లో జీవిత రాజశేఖర్ హీరోహీరోయిన్లగా నటించిన ఈ సినిమా కూడా హిట్ అయ్యింది.
నవభారతం – సూపర్ హిట్
1988 లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రాజశేఖర్ జీవితలు మరోమారు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా హిట్ అయ్యింది
మమతల కోవెల – సూపర్ హిట్
Advertisement
1989లో విడుదలై హిట్ కొట్టిన ఈ సినిమాలో …. రాజశేఖర్, సుహాసిని హీరోహీరోయిన్లుగా నటించారు.
ధర్మయుద్దం -యావరేజ్
1989లో AM రత్నం ప్రొడ్యూసర్ గా రాజశేఖర్ రజనీలు ప్రధానపాత్రలో ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.
అన్న – సూపర్ హిట్
1994 లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో రాజశేఖర్, గౌతమి, రోజా హీరోహీరోయిన్లుగా విడుదలైన చిత్రం అన్న.. . ఈ సినిమా 1995 లో IIFA చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది.
సూర్యుడు -సూపర్ హిట్
తమిళ చిత్రం మరు మలార్చికి రీమేక్ గా 1998 లో రాజశేఖర్ సౌందర్యలు జంటగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.
మనసున్నమారాజు -హిట్:
మళయాళంలో వచ్చిన కొట్టరం వీట్టిలే అప్పటన్ సినిమాకి రిమేక్ సినిమా 2000 లో రాజశేఖర్ లయలు జంటగా ముత్యాల సుబ్బయ్య తీసిన చిత్రం మనసున్నమారాజు . బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా హిట్ గా నిలిచింది.
ఆప్తుడు – ఫ్లాప్:
2004లో రాజశేఖర్ అంజలా జవేరీలు జంటగా ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ప్లాప్ గా మిగిలింది.
Advertisements
మొత్తం మీద…ముత్యాల సుబ్బయ్య రాజశేఖర్ తో 9 సినిమాలు తీస్తే ఇందులో ఒక్కటి మినహా అన్ని హిట్స్ గా అయ్యాయి.