Advertisement
అదృష్టం అంటే రాకేష్ ఝున్‌ఝున్‌వాలా అనే ఈ ఇన్వెస్టర్ ది.! లాక్ డౌన్ సమయంలో…. ఉన్న వ్యాపారాలకే దిక్కులేక అందరూ దివాలా తీసే పరిస్థితికి వస్తే…ఈయన మాత్రం 3 నెలల్లో 42 కోట్లు సంపాదించి ఔరా అనిపించాడు.! కేవలం మార్కెట్ ట్రెండ్ ను ఫాలో అవుతూ కోట్ల లాభం గడించాడు.!
ఏం చేశాడు? :
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా …2020, మార్చి 23వ తేదీన ఎస్కార్ట్స్ అనే కంపెనీలో రూ.50.16 కోట్ల పెట్టి…. ఆ కంపెనీకి చెందిన 91 లక్షల షేర్లను కొన్నాడు. అప్పుడు BSE లో ఆ కంపెనీ స్టాక్ వాల్యూ రూ.551.30 ఉంది! మూడు నెలల తర్వాత ఆ షేర్ వాల్యూ 1,015 అయింది. దీంతో ఝున్‌ఝున్‌వాలా మొత్తం షేర్ల విలువ రూ.92.36 కోట్లు అయింది. అంటే ఆయన పెట్టింది 50 కోట్లు వచ్చింది 92 కోట్లు..లాభం 42 కోట్లు.!
Advertisement
ఎస్కార్ట్స్ కంపెనీ అప్పుడప్పుడే గ్రోత్ అవుతుందన్న విషయాన్ని తెల్సుకున్న ఝున్‌ఝున్‌వాలా అందులోనే తన పెట్టుబడి పెట్టాడు. ఈ 3 నెలల కాలంలోనే ఎస్కార్ట్స్ కంపెనీ స్టాక్ విలువ 84.21 శాతం మేర పెరిగింది. ప్రస్తుతం వారం వ్యవధిలోనే వాటి విలువ 8.29 శాతం పెరగడం మరో విశేషం. ఈ కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువ రూ.12,127 కోట్లుగా ఉంది. ఈ లెక్కలు ఎలా ఉన్నా…ఝున్‌ఝున్‌వాలాకు మాత్రం అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టిందన్నమాట.!
Advertisements
ట్రేడింగ్ …ఇన్వెస్ట్ మెంట్ అనేది కాస్త రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఏదో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా స్పూర్తిగా తీసుకొని మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలని బయలుదేరకండి.! ఇదే రంగంలో కోట్ల రూపాయలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు.! కాస్త ఎక్స్ పీరియన్స్, ట్రెండ్స్ ను ఫాలో అవ్వడం, ముందుచూపుతో వ్యవహరించడం లాంటి గుణాలుంటే షేర్ మార్కెట్ లో సక్సెస్ అవ్వొచ్చు అనేది నిపుణుల సలహా.!
Advertisements