Advertisement
కుడి ఎడమైతే.. పొరపాటు లేదోయ్.. అన్న సినీ కవి మాటలు ఆదర్శంగా తీసుకున్నాడో… లేక ఏం చేసైనా తాను దర్శకుడు కావాలనుకున్నాడో కానీ,, సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘శివ’ సినిమా కోసం ఓ పెద్ద అబద్దామాడాడు. తండ్రీకొడుకుల మధ్య గొడవను ఆసరాగా తీసుకుని, ఏకంగా శివ సినిమా పట్టాలెక్కించాడు.లోకానికి తెలియని ఈ విషయాన్ని వర్మ తానే స్వయంగా వెల్లడించాడు
ఏం జరిగింది?
రావుగారిల్లు సినిమా సమయంలో ఆర్జీవీ అసిస్టెంట్ డైరెక్టర్. బాగా ఇంగ్లీష్ మాట్లాడే ఆర్జీవీతో నాగార్జున స్వల్పకాలంలోనే స్నేహం చేశాడు. ఇద్దరూ మంచి మిత్రులయ్యారు. మంచి కథ ఉంటే పట్రా.. సినిమా చేద్దామన్నాడు. ఇంకేముందీ.. ఎగిరి గంతేసిన ఆర్జీవీ.. వెళ్లి కథ రాసుకుని వచ్చాడు. నాగార్జునకు ఓహారర్‌స్టోరీ వినిపించాడు. కానీ, అంతగా నచ్చలేదు. వెంటనే వెళ్లి నాగార్జున సోదరుడు వెంకట్‌కు చెప్పాడు. కానీ, హారర్ స్టోరీలు నాగార్జునకు సెట్ కావని, హీరో ఓరియెంటెడ్ స్టోరీ కావాలని చెప్పడంతో ఆర్జీవీ నీరుగారిపోయాడు. అయినా నిరుత్సాహ పడకుండా.. ఇంటికెళ్లి ‘‘బ్రూస్ లీ’’ ఎంటర్ ది డ్రాగన్ సినిమా, హిందీ అర్జున్ సినిమాలను కలిపి రాత్రికిరాత్రి ‘‘శివ’’సినిమా కథరాసుకుని వచ్చాడు. నాగార్జునకు బాగా నచ్చింది.
Advertisement
వెంకట్, ఏఎన్నార్‌కు అబద్దం చెప్పి…!
కథ మీద నాగార్జున 100శాతం నమ్మకముందన్నాడు. కానీ, అపుడు ఏదో కారణాల వల్ల వెంకట్‌పై అక్కినేని నాగేశ్వరరావు కోపంగా ఉన్నారు. వారిద్దరూ కొన్నిరోజులుగా మాట్లాడుకోవడం లేదు. తన ప్రాజెక్టు అందరికీ నచ్చినా.. వీరిద్దరూ ఓకే చెప్పలేదు. దాంతో ఆర్జీవీ ఒక ప్లాన్ వేశాడు. ఓరోజు వెంకట్ దగ్గరికెళ్లాడు. అక్కినేనిగారు ‘‘శివ’’ సినిమా స్టార్ట్ చేయమన్నాడు అని వెంకట్‌కు అబద్దం చెప్పారు. వెంకట్‌కు చేయమన్నారని ఏఎన్నార్ వద్ద చెప్పాడు. ఇద్దరూ నమ్మేసి సినిమాకు కొబ్బరికాయ కొట్టమన్నారు..
అబద్దం.. ఇండస్ట్రీ తలరాతను మార్చివేసింది..!
ఆ రోజు ఆ అబద్దం ఆర్జీవీ చెప్పి ఉండకపోతే.. ఇంత మంచి చిత్రం తెలుగు సినీ పరిశ్రమకు దక్కి ఉండేది కాదు. ఇప్పటికీ తెలుగు సినిమాను శివకు ముందు, శివకు తరువాత అన్నట్లుగానే చెప్పేస్థాయిలో సినిమా నాణ్యత ఉందంటే అతిశయోక్తి కాదు. వెరైటీ టేకింగ్,, కెమెరా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నింట్లోనూ కొత్తదనమే. అందుకే, ప్రేక్షకులు సినిమాను నెత్తినపెట్టుకున్నారు. ఒక సమయంలో చిక్కడపల్లి సంధ్య థియేటర్లో బ్లాక్‌ల్లో అమ్మేవారు రోజుకు రూ.2వేలకుపైగా సంపాదించారంటే ఈ సినిమాకు అపుడు ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు.
Advertisements
మొదట తీసుకొచ్చిన సినిమా రాత్రి..
ఇంతకీ నాగార్జున కోసం వర్మ తొలుత రాసుకున్న ఆ సినిమా ఏంటనుకుంటున్నారా? ఇంకేంటో కాదు.. అది రాత్రి సినిమా.. రేవతి ప్రధాన పాత్రలో వచ్చిన ఆ సినిమా సూపర్ హారర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని వర్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తానే స్వయంగా వెల్లడించాడు. అబద్దాలాడి తాను డైరెక్టర్‌ను అయ్యానని ఒప్పుకున్నాడు.
Advertisements
Also Read: శివ సినిమా ఎందుకు అంతలా హిట్ అయ్యింది.? ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీలో వచ్చిన మార్పులేంటి?