Advertisement
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనాభాలో కొందరికి అరుదైన అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. కొందరు ఆయా సమస్యలతో చనిపోతే.. కొందరు మాత్రం వాటికి చికిత్స లభించక జీవితాంతం ఆయా సమస్యలతో ఇబ్బందులు పడుతూనే ఉంటారు. కింద ఇచ్చింది కూడా అలాంటి పలువురి గురించే. వీరు అత్యంత అరుదైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. దాని వల్ల వారి శరీరమంతా వెంట్రుకలు పెరుగుతాయి.
Advertisement
ఈ అరుదైన స్థితిని వైద్య పరిభాషలో హైపర్‌త్రైకోసిస్ అని పిలుస్తారు. దీన్నే వేర్‌వోల్ఫ్ సిండ్రోమ్ అని కూడా అంటారు. పురాణ గాథల్లో ఉండే తోడేలు మనిషికి శరీరమంతా వెంట్రుకలు ఉంటాయి కదా. సరిగ్గా అలాగే ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్లకు శరీరమంతటా దట్టంగా వెంట్రుకలు పెరుగుతున్నాయి. సాధారణంగా మన శరీరంలో పలు చోట్ల వెంట్రుకలు మొలిచేలా చేసే కణాలు యాక్టివ్‌లో ఉండవు. కానీ ఈ స్థితి ఉన్నవారి శరీరమంతటా సదరు కణాలు యాక్టివ్‌గానే ఉంటాయి. అందువల్ల శరీరం మొత్తం ఎక్కడ చూసినా వెంట్రుకలే కనిపిస్తాయి.
చిత్రంలో ఉన్న అక్కా చెల్లెళ్ల పేర్లు.. సవిత, మోనిషా, సావిత్రి. అయితే ఈ స్థితి 100 కోట్ల మందిలో ఒక్కరికి మాత్రమే వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది జన్యుపరమైన పరివర్తనాలు చెందడం వల్ల వస్తుందని వారు అంటున్నారు. దీనికి చికిత్స చేస్తే బాగయ్యేందుకు అవకాశం ఉందని తెలిపారు. ఏది ఏమైనా.. ఈ ముగ్గురు అక్కా చెల్లెళ్లు పడుతున్న బాధ మాత్రం అంతా ఇంతా కాదు. వీరు తమకున్న సమస్య కారణంగా నలుగురిలోనూ తిరగలేకపోతున్నారు. వీరికి చికిత్స అందించేందుకు డాక్టర్లు ముందుకు వస్తారో, లేదో చూడాలి.
Advertisements