Advertisement
కొన్నిసార్లు అదృష్టం అడ్డంగా కలిసొస్తుందంటారు కదా….అదే జరిగింది రాశీఖన్నా విషయంలో…. ఖన్నా ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ లో BA( Eng) చదువుతున్న సమయంలో ఆ కాలేజ్ కు Vaseline కంపెనీ వాళ్లు తమ ప్రొడక్ట్ అడ్వర్టైజ్ చేస్తూ….ఆ కాలేజ్ అమ్మాయిలకు ఓ ఆఫర్ ఇచ్చారట. నచ్చిన స్టిల్ ఇస్తూ ఫోటో దిగండి – Vaseline ను గిప్ట్ గా పొందండని.!
Advertisement
ఫ్రీగా Vaseline వస్తుంది కదా అని…రాశీఖన్నా కూడా తనకు నచ్చిన స్టిల్ లో ఓ ఫోటోదిగి…వాళ్లిచ్చిన Vaseline ను తీసుకొచ్చుకుందట. కట్ చేస్తే రాశీఖన్నా ఫోటో నచ్చి ఆ ఫోటోను ఫెమినా మ్యాగజైన్ వాళ్లు కవర్ పేజ్ గా వేశారు. Vaseline కంపెనీ కూడా రాఖీ అందాన్ని నచ్చి తమ ఉత్పత్తులకు తనతోనే ప్రమోట్ చేయించారు. ఇలా రాశిని గమనించిన డైరెక్టర్ సుజిత్ సిర్కార్ తన మద్రాస్ కేఫ్ అనే సినిమాలో అవకాశమిచ్చాడు.
ఆ సినిమాలో రాశీ యాక్టింగ్ నచ్చిన అవసరాల శ్రీనివాస్ ….తను డైరెక్ట్ చేస్తున్న ఊహలు గుసగుసలాడే సినిమాలో నాగశౌర్య పక్కన రాశీఖన్నాను హీరోయిన్ గా ఎంచుకున్నాడు. ఈ సినిమాకు SIIMA (బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ ) అవార్డ్ అందుకుంది రాశీ. ఆ తర్వాత రాశీ తెలుగులో అనేక సినిమాలు చేసింది.
Advertisements
మొదటి నుండి క్లాస్ లో మెరిట్ స్టూడెంట్ అయిన రాశీ ఖన్నా టార్గెట్ IAS అవ్వడం. అనుకోకుండా సినిమాల్లోకి రావడం తర్వాత అవకాశాలతో బిజీ అవ్వడంతో సినిమాలనే
కెరియర్ గా ఎంచుకుంది.
Advertisements