Advertisement
రవితేజ సినిమాలతో పూరి జగన్నాథ్ స్టార్ దర్శకుడిగా గుర్తింపు పొందితే , పూరి సినిమాలతోనే రవితేజ స్టార్ హీరోగా నిలదొక్కుకున్నాడు. వీరి కాంబోలో 5 సినిమాలు వస్తే….. వాటిల్లో 3 సినిమాలు సూపర్ హిట్లు అవ్వగా 1 సినిమా యావరేజ్ కాగా, మరో సినిమా ప్లాప్ అయ్యింది!
1. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం
బాచి సినిమా ప్లాప్ తర్వాత పూరికి ఎవ్వరు అవకాశాలు ఇవ్వకపోతే ….. ఎవడితోనో తీసేదేంటి నా ఫ్రెండ్ రవి ఉన్నాడుగా అని రవితేజ తో కమిటై ….. కొత్త కాన్సెప్ట్ తో తీసిన లవ్ స్టొరీ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ! దీనికి రవితేజ సైడ్ నుంచి ఒక ఫైనాన్సర్ హెల్ప్ చేసాడు. 2001 లో రిలీజైన ఈ సినిమా సూపర్ హిటై రవితేజ కు హీరోగా, పూరికి డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. వాస్తవానికి ఈ కథను మొదట పవన్ కళ్యాన్ కు చెప్పాలనుకున్నాడు…కానీ కరెక్ట్ టైమ్ లో బద్రీ కథ చెప్పి…పవన్ తో బద్రీ సినిమా తీసి హిట్ కొట్టాడు పూరీ!
2. ఇడియట్
Advertisements
2002 లో… పెద్ద స్టార్ హీరోల నుండి కుర్ర హీరోల దాకా తిరిగిన ఈ స్టోరీకి రవితేజ కరెక్ట్ ఛాయిస్ అని మళ్ళీ తనతోనే మూవీ చేసాడు పూరి . హీరో క్యారెక్టరైజేషన్ లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన ఇడియట్ బ్లాక్ బస్టరై అప్పటి స్టార్ హీరోలకు దీటుగా కలెక్షన్స్ వసూల్ చేసింది . ఈ సినిమా దెబ్బకు ఇద్దరు స్టార్స్ అయిపోయారు.
3. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి
Advertisement
2003 లో రిలీజైన సూపర్ కమర్షియల్ ఎంటర్టైనర్ అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి . ఇందులో కూడా రవితేజ నటన, పూరి టేకింగ్ లే కనిపిస్తాయి. ఇంతమంచి నటుణ్ని ఇన్నిరోజులు మిస్ అయ్యామా? అనిపించిన సినిమా ఇది. ఈ సినిమా సూపర్ హిట్టై వీరిద్దరి క్రేజ్ ని ఇంకా పెంచింది.
4. నేనింతే
వీరిద్దరూ స్టార్స్ గా ఎవరు బిజిలో వాళ్ళు ఉంటూ ….. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత 2009 లో రిలీజైన సినిమా నేనింతే ! హ్యాట్రిక్ కాంబో కావడంతో మంచి ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజైన ఈ సినిమా ఊహించిన లెవల్లో ఆడలేదు…కానీ కొంతమందికి మాత్రం పిచ్చిపిచ్చిగా ఎక్కేసింది! ముఖ్యంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇద్దామనుకునే యూత్ కి ఈ సినిమా ఓ టార్చ్ లైట్!
5. దేవుడు చేసిన మనుషులు
2012 లో ఒక విచిత్రమైన ఆలోచనతో సినిమాగా రూపొందిన దేవుడు చేసిన మనుషులు ఎవర్ని ఆకట్టుకోలేక పోయింది. పూరి , రవితేజ కాంబినేషన్లో వచ్చిన చివరి సినిమా ఇదే. తర్వాత వీరి కాంబినేషన్లో 2018 లో ఒక మూవీ అనుకున్నారు కానీ అది జరగలేదు . త్వరలోనే వీరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతుందని సమాచారం.!
Advertisements
తర్వాత వీరి కాంబినేషన్లో 2018 లో ఒక మూవీ అనుకున్నారు కానీ అది జరగలేదు . త్వరలోనే వీరి కాంబినేషన్లో ఒక సూపర్ హిట్ రాబోతుందని సమాచారం.