Advertisement
రాయలసీమ అనగానే ఫ్యాక్షనిజం,కత్తులు..పగలు ,ప్రతీకారాలు ఇవే గుర్తొస్తాయి..సినిమాల్లో కూడా వాటినే ఎక్కువగా చూపిస్తుంటారు..మా సీమ ప్రేమకు పెట్టింది పేరు..సినిమాల్లో చూపించేది నిజం కాదు అని రాయలసీమ వాసులు కొట్టిపడేస్తుంటారు..మా సీమని నెగటివ్ గా ప్రచారంచేస్తున్నారని వాపోతుంటారు..కానీ సీమ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన ప్రతి సినిమా హిట్..సూపర్ హిట్.. ఆ సినిమాల్లోని ప్రేమకథలు కూడా మిగతా లవ్ స్టోరీస్ కంటే డిఫరెంట్ గా ఉంటాయి..అటువంటి కొన్ని సినిమాలు,వాటిల్లోని ప్రేమకథలు మీకోసం..
ప్రేమించుకుందాం రా..!
వెంకటేశ్ ,అంజలా జవేరి జంటగా వచ్చిన ప్రేమించుకుందాం రా సినిమా..అప్పట్లో సూపర్ డూపర్ హిట్..మ్యూజిక్ పరంగా కూడా గొప్ప మ్యాజిక్ చేసింది ఈ సినిమా..ఇప్పటికి లిటిల్ హార్ట్స్ ప్యాకెట్ చూసినా, పాటలు విన్నా గతంలోకి వెళ్లిపోతుంటారు ఎందరో ప్రేమికులు..ప్రతినాయకుడి పాత్రలో నటించిన జయప్రకాశ్ రెడ్డికి చాలా పేరు తీసుకొచ్చింది.
కృష్ణగాడి వీర ప్రేమగాధ..
Advertisements
నాని,మెహ్రీన్ జంటగా వచ్చిన సినిమా కృష్ణగాడి వీర ప్రేమగాధ.. నాని మిగతా సినిమాల్తో పోలిస్తే వాటంతట హిట్ కాకపోయినా మంచి ఎంటర్టైనర్..చిత్తూరు బ్యాక్గ్రౌండ్లో బాలకృష్ణ వీరాభిమానిగా నాని ఈ సినిమాలో కనిపిస్తాడు.
అంత:పురం:
కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా అంత:పురం..ప్రేమించిన వ్యక్తితో అత్తవారి ఊరు సీమకు వచ్చిన సౌందర్య..ఫ్యాక్షన్ గొడవల్లో భర్తను పోగొట్టుకుని బిడ్డతో పాటుగా ఆ గొడవలకు దూరంగా పారిపోయేందుకు చేసే ప్రయత్నమే అంత:పురం..ప్రకాశ్ రాజ్, జగపతిబాబు,శారద, సాయికుమార్ లాంటి ఎందరో నటులు ఈ సినిమాలో నటించారు.
ఒక్కడు:
కర్నూల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఒక్కడుసినిమా మహేశ్ కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్..ఈ సినిమాలో కబడ్డి ప్లేయర్ గా మహేశ్ నటించాడు..ఈ సినిమా కోసం కబడ్డి నేర్చుకుని ,ప్రాక్టీస్ చేసి యాక్ట్ చేసాడంట.. మహేశ్ కి జోడిగా భూమిక, ప్రతినాయక పాత్రలో ప్రకాశ్ రాజ్ నటించారు.. కొండారెడ్డి బురుజు ఈ సినిమాలో ప్రత్యేకం!
Advertisement
రాయలసీమ రామన్నచౌదరి:
ప్రేమకథగా ఎంచుకోవాల్సిన సినిమా కాదు..కానీ నాస్తికత్వాన్ని ప్రోత్సహించే విధంగా ఉంటుంది..ఈ సినిమాలో మోహన్ బాబు నాస్తికుడిగా నటించాడు..2000లో రిలీజైన ఈ సినిమా డైలాగులు ,సీన్స్ ఇరవైఏళ్లైనా ఇప్పటికి బాగా ఫేమస్.
మర్యాదరామన్న:
రాజమౌలి దర్శకత్వంలో సునీల్,సలోని ప్రధాన పాత్రలుగా వచ్చిన సినిమా మర్యాదరామన్న..ఈ సినిమాలో శతృవు ఇంట్లో చిక్కుకుపోయి, ఆ ఇంటి అమ్మాయినే ప్రేమించే పాత్రలో సునీల్ నటించాడు..చివరిక ఎలా వారి ప్రేమను నమ్మకాన్ని గెలిచాడు అనేది స్టోరీ..
సరిలేరు నీకెవ్వరు..!
కర్నూల్ బ్యాక్ డ్రాప్ మహేశ్ కి బాగా కలిసొచ్చింది..అదే ఈ సినిమాలో కూడా చెప్తారు..ఈ సినిమాలో ఆర్మి ఆఫీసర్ గా నటించిన మహేశ్ సరసన రశ్మిక నటించగా..సీనియర్ నటి విజయశాంతి ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. కొండారెడ్డి బురుజు వద్ద ఫైట్ సీన్ అదుర్స్ !
అరవింద సమేత:
ఎన్టీయార్,పూజాహెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అరవింద సమేత..ఫ్యాక్షన్ గొడవలకు దూరంగా వచ్చిన ఒక యువకుడు, సీమలో ఫ్యాక్షనిజాన్ని ఎలా రూపుమాపాడు.. అతన్ని ప్రేమించిన అరవింద కథ అరవింద సమేత వీరరాఘవ..ఈ సినిమాలో ఒకప్పటి ఫ్యామిలిహీరో జగపతిబాబు విలన్ గా నటించాడు.
బాలయ్య బాబు బ్లాక్ బస్టర్ సినిమాల్లో చాలా వరకు రాయలసీమలో తీసినవే..!
Advertisements