Advertisement
సోషల్ మీడియాలో మనం నిత్యం అనేక రకాల వార్తలు చదువుతుంటాం. అయితే వాటిలో అసలు కన్నా ఫేక్ వార్తలే ఎక్కువగా మనకు కనిపిస్తుంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఫేక్ వార్తలను కూడా నిజమే అని ఎన్నో రోజులుగా నమ్ముతాం. అలాంటి వాటిని అబద్ధమని ఎవరూ చెప్పరు. అందువల్ల అవి నిజమే అని నమ్ముతూ వస్తుంటాం. కింద చెప్పబోయేది కూడా సరిగ్గా అదే కోవకు చెందిన ఓ వార్తే. టూత్‌పేస్ట్ ట్యూబ్‌ల కింది భాగంలో నలుపు, ఆకుపచ్చ, ఎరుపు, బ్లూ కలర్లలో స్ట్రిప్స్ ఉంటాయి కదా.. దీని గురించి మనం గతంలోనే తెలుసుకున్నాం.
టూత్‌పేస్ట్ ట్యూబ్ కింది భాగంలో బ్లూ కలర్ స్ట్రిప్ ఉంటే ఆ టూత్‌పేస్టులో డ్రగ్స్ వాడారని, అదే గ్రీన్ స్ట్రిప్ అయితే అందులో అన్నీ సహజసిద్ధమైన పదార్థాలు వాడారని, రెడ్ అయితే సహజసిద్ధమైన పదార్థాలు, కెమికల్స్ వాడి ఆ టూత్‌పేస్ట్‌ను తయారు చేసి ఉంటారని, బ్లాక్ అయితే ఆ టూత్‌పేస్టులో వాడినవన్నీ కెమికల్సేనని.. మనం గతంలో అనేక సార్లు చదివాం. అది నిజమే అని ఇప్పటికీ నమ్ముతున్నాం. కానీ అది అబద్ధమని తేలింది. అవును.. దీని గురించి ఇప్పటి వరకు మనకు ఎవరూ చెప్పలేదు. అందుకనే ఈ విషయాన్ని ఇన్ని రోజుల నుంచీ మనం నిజమే అని నమ్ముతూ వచ్చాం. కానీ ఈ విషయం మాత్రం అబద్ధమని తేలింది. అయితే మరి ఆ కలర్ స్ట్రిప్స్‌కు అర్థమేమిటి ? వాటిని టూత్‌పేస్టు ట్యూబ్‌లపై ఎందుకు ముద్రించారు ? అంటే…
Advertisement
Advertisements
టూత్‌పేస్టు ట్యూబ్‌లపై ఉండే సదరు కలర్ స్ట్రిప్స్‌ను ఎలక్ట్రానిక్ సెన్సార్లు గుర్తిస్తాయి. వాటి సహాయంతో ట్యూబుల్లో ఏ పేస్టును ఎంత నింపాలి, ట్యూబ్ సైజ్ ఎంత, అది సరిగ్గా సీల్ అయిందా, లేదా.. అన్న వివరాలను తెలుసుకునేందుకు సదరు స్ట్రిప్స్‌ను ముద్రిస్తారు. వాటితో మనకు అస్సలు పనిలేదు. టూత్‌పేస్టు తయారీ కంపెనీల్లో ఉండే మెషిన్లలోని ఎలక్ట్రానిక్ సెన్సార్లు ఆ కలర్ స్ట్రిప్‌ల పని చూసుకుంటాయి. అంతేకానీ.. వాటితో మనకు అస్సలు ఏ మాత్రం సంబంధం లేదు. అదంతా మెషిన్ వర్క్ మాత్రమే. కనుక ఆ కలర్ స్ట్రిప్స్‌ను చూసి అనవసరంగా భయపడకండి. నిజానికి సహజసిద్ధమైన పదార్థాలతో టూత్‌పేస్ట్‌ను తయారు చేసినా అందులో ఎంతో కొంత మొత్తంలో కెమికల్స్, డ్రగ్స్ కలుస్తాయి. కనుక ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన పని లేదు.
Advertisements