Advertisement
పొట్ట రావడం అనేది ఈ మధ్య కాలంలో పెద్ద సమస్యగా మారింది. ఎలా తగ్గించుకోవాలి అనేది తెలియక… తెలిసినా ఫాలో అవ్వలేక కాస్త ఇబ్బందులు పడుతూ ఉంటారు. అసలు పొట్ట రావడానికి కారణం ఏంటో కూడా చాలా మందికి క్లారిటీ లేదనే చెప్పాలి. పొట్ట రావడానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం.
Also Read:మనసు అనే పార్ట్ ఉందా…? మనసు భారం అంతా దేని మీద ఉంటుంది…?
ఎక్కువ చక్కెరతో కూడిన ఆహారపదార్ధాలు తీసుకోవడం ఎంత మాత్రం మంచిది కాదు. దీనితో పొట్ట వచ్చే అవకాశాలు ఎక్కువ. బేకరీ ఐటమ్స్ అయిన కేకులు మరియు మిఠాయిలు,సోడా మరియు పండ్ల రసం వంటి పానీయాలు కూడా పొట్ట రావడానికి కారణమే. తక్కువ ప్రోటీన్స్ ,ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం తినడంతో… తక్కువ పీచు పదార్దాలు కల ఆహరం తీసుకోవడంతో పొట్ట వస్తుంది.
Advertisement
అధిక ఆల్కహాల్ తీసుకోవడంతో… కూడా మనకు పొట్ట వస్తుంది. మందకొడి జీవన శైలి ,వ్యాయామం లేకపోవడం వంటి కారణాలతో కూడా పొట్ట వచ్చే అవకాశం ఉంది. రక్తంలో నియంత్రణ లేని చక్కర అంటే షుగర్ తో కూడా పొట్ట వస్తుంది. హైపోథైరోడిజం అంటే… ధైరాయిడ్ గ్రంధి తక్కువగా పనిచేయడం తో కూడా పట్ట వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్టెరాయిడ్స్ తీసుకోవడం, మానసిక ఒత్తిడితో కూడా పొట్ట వచ్చే అవకాశం ఉంది. నోటి ద్వారా తీసుకొనే గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం, తగినంత నిద్ర లేక పోవడం కూడా దీనికి కారణమే.
Advertisements
Advertisements
Also Read:ట్రెడ్మిల్ మీద వాకింగ్ ఎందుకు వద్దు…?