Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించినప్పటికి హీరోకి సమానంగా క్రెడిట్ కొట్టేసే క్యారెక్టర్స్..సోనూసూద్ నటించిన సినిమాలు!!

Advertisement

సోనూసూద్ .. ఒకప్పుడు విలన్ ..మరి నేడు రియల్ హీరో.. యావత్ దేశం అంతా ఇప్పుడు సోనూ నామస్మరణ చేస్తుంది..కష్టం అని తెలిస్తే చాలు తానున్నానంటూ ముందుకొస్తున్నాడీ రీల్ విలన్..హీరో అనే పదం విన్నా, చదివినా సోనూసూద్ మాత్రమే రియల్ హీరో అంటూ జనం ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.. సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించినప్పటికి హీరోకి సమానంగా క్రెడిట్ కొట్టేసే క్యారెక్టర్స్ పోషించాడు… లీడ్ యాక్టర్ కి ధీటుగా  సోనూసూద్ నటించిన కొన్ని తెలుగు సినిమాలు మీకోసం..

సూపర్:

హ్యాండ్సప్, అమ్మాయిలు అబ్బాయిలు సినిమాల్లో నటించినప్పటికి సూపర్ సినిమా ఛాన్స్ తోనే తెలుగు వాళ్ల దృష్టిలో పడ్డాడు .. ఈ సినిమాలో నాగార్జున, సోనూ ఫ్రెండ్స్ గా నటించారు..

అరుంధతి:

Advertisements

సోనూసూద్ అని తలచుకోగానే కళ్లముందు మెదిలే పాత్ర అరుంధతి సినిమాలోని పశుపతి.. ఈ పాత్రకి సోనూ తప్ప మరొకరు సూట్ కారు అన్నట్టుగా నటించాడు..

జులాయి:

అల్లు అర్జున్, సోనూసూద్ హోరాహోరిగా సాగే కథ జులాయి.. ఒక  దశలో బన్ని కంటే ఎక్కువ మార్కులు సోనూనే కొట్టేశాడు..ఈ సినిమాలో బిట్టు పాత్రలో అదరగొట్టాడు.

కందిరీగ:

అరుంధతిలో తన నటనతో భయపెట్టిన సోనూ..కందిరీగ సినిమాలో కామిక్ విలన్ గా తొలిసారి తన నటనతో భయంతో పాటు నవ్వు పుట్టించాడు..ఈ సినిమాలో భవాని పాత్రలో నటించి మెప్పించాడు.

అశోక్:

అశోక్ సినిమాలో  ఎన్టీయార్ ప్రేమించిన అమ్మాయి సమీరారెడ్డిపై మనసుపడే పాత్రలో కనిపించాడు సోనూసూద్. ఈ సినిమాలో కొంచెం రఫ్ గా ఉన్నప్పటికి యాక్టింగ్ పరంగా అదరగొట్టాడు.

Advertisement

ఆగడు,దూకుడు:

శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన ఆగడు, దూకుడు రెండు సినిమాల్లోనూ మహేశ్ ప్రధానపాత్రలు పోషించగా , ప్రతినాయకుడుగా సోనూసూద్ నటించాడు..

అభినేత్రి:

ప్రభుదేవా, తమన్నా, సోనూసూద్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన హార్రర్ కామెడి మూవి అభినేత్రి.. తెలుగు ,తమిళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమాలో సోనూ రొమాంటిక్ గా కనిపిస్తాడు.

అతడు:

అతడు సినిమాలో మహేశ్ బాబు స్నేహితుడిగా సోనూసూద్ నటించాడు..ఈ సినిమాలో మిగతా పాత్రలతో పోలిస్తే సోనూ నిడివి కాస్తా తక్కువే అయినా..కనిపించినంత సేపు తన మార్క్ నటనతో ఆకట్టుకున్నాడు.

ఆంజనేయులు:

రవితేజ, నయనతార నటీనటులుగా వచ్చిన ఈ సినిమాలో సోనూ డాన్ గా నటించాడు.

ఏక్ నిరంజన్:

ప్రభాస్ ,కంగనా జంటగా పూరి దర్శకత్వంలో వచ్చిన ఏక్ నిరంజన్ సినిమాలో జానీభాయ్ గా నటించాడు సోనూ సూద్..ఈ సినిమాలో విలనిజంతో భయపెడుతూనే కామెడితో నవ్వించాడు.

Advertisements