Advertisement
కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకునేందుకు RBI మరోమారు రెపోరేట్ తగ్గించింది. RBI తమ రెపో రేట్ తగ్గించడం వరుసగా ఇది 7 వసారి. ప్రస్తుతం 4.4 నుండి 4 కు RBI తన రెపోరేట్ తగ్గించింది. ఇది ఇంతకు ముందే లోన్ తీసుకున్నవారికి, కొత్తగా లోన్ తీసుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్.
Advertisement
మనకేం లాభం…దీని గురించి తెలియాలంటే మొదట రెపో రేట్ గురించి తెలియాలి. మనం అవసరానికి తెచ్చుకున్న డబ్బుపై వడ్డీ చెల్లించినట్టే…బ్యాంకులు తమ అవసరాలకు RBI నుండి డబ్బును వడ్డీకి తెచ్చుకుంటాయి. ఆ వడ్డీనే రెపో రేట్ అంటారు. అంటే RBI ఇచ్చే వడ్డీ రేటు అన్నమాట.! RBI వడ్డీ రేట్లు తగ్గిస్తే …బ్యాంకులు RBI నుండి ఎక్కువ డబ్బులు తీసుకుంటాయి. బ్యాంకుల దగ్గర ఎక్కువ డబ్బులుంటాయి కాబట్టి…మనకు తక్కువ వడ్డీకే లోన్ లు దక్కుతాయి. దీంతో కొత్తగా లోన్ తీసుకోవాలనేకునే వారికి తక్కువ ఇంట్రస్ట్ కే లోన్స్ దక్కుతాయన్నమాట.! 7 సార్లలో ..RBI దాదాపు 250 పాయింట్లను తగ్గించింది. అంటే 2.5 శాతం వడ్డీని తగ్గించిందన్నమాట.!
రివర్స్ రెపో రేట్ .… బ్యాంకులు తమ దగ్గర ఉన్న డబ్బును RBI కి అప్పుగా ఇవ్వొచ్చు…అలా ఇచ్చిన డబ్బుకు RBI ఇచ్చే వడ్డిన రివర్స్ రెపో రేట్ అంటారు. రివర్స్ రెపో రేట్ కంటే రెపో రేట్ ఎక్కువగా ఉంటుంది.
Advertisements