Advertisement
సాధారణంగా మన దేశంలో పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులే అత్యంత ధనికులుగా ఉంటారు. ఇక దాదాపుగా ఎవరూ వారికి పోటీ రారు. కానీ ఈ ఐపీఎస్ ఆఫీసర్ మాత్రం పోలీసుల్లోకెల్లా అత్యంత ధనికుడిగా రికార్డులకెక్కారు. ఈయన ఆస్తి విలువ రూ.152 కోట్లకు పైమాటే. అయితే అంత ధనికుడైనా ఈయన ఇంకా అదే వృత్తిలో కొనసాగుతున్నారు. ఆయనే పంజాబ్‌కు చెందిన గుర్‌ప్రీత్ సింగ్ భుల్లార్.
గుర్‌ప్రీత్ సింగ్‌కు ఉన్న అన్ని ఆస్తుల విలువ రూ.152 కోట్లకు పైగానే ఉంటుంది. ఈ మేరకు ఆయన కేంద్ర హోం శాఖ వెబ్‌సైట్‌లో తనకున్న ఆస్తుల వివరాలను ప్రకటించారు. 2011వ సంవత్సరం నుంచి దేశంలోని ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కచ్చితంగా తమకు, తమ కుటుంబ సభ్యులకు ఉన్న అన్ని ఆస్తుల వివరాలను వెల్లడించాలని అప్పట్లో చట్టం తెచ్చారు. దీని ప్రకారం ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ అప్పటి నుంచి తమ ఆస్తుల వివరాలను వెల్లడిస్తున్నారు. ఇక గుర్‌ప్రీత్ సింగ్ కూడా తన ఆస్తుల వివరాలను వెల్లడించగా.. వాటి విలువ రూ.152 కోట్లకు పైనే ఉంటుందని వెల్లడైంది. దీంతో ఆయన పంజాబ్‌లోని అత్యంత ధనిక ఐపీఎస్‌లలో నంబర్ వన్ స్థానంలో ఉన్నారు.
Advertisement
Advertisements
అయితే ఈ ఆస్తులన్నీ గుర్‌ప్రీత్‌కు తన తాతలు, తండ్రుల నుంచి సంక్రమించినవి. ఆ వివరాలను ఆయనే స్వయంగా తాను సమర్పించిన అఫిడవిట్‌లో వెల్లడించారు. మొహాలీలో ఈయన అత్యంత సుదీర్ఘకాలం పాటు ఎస్‌ఎస్‌పీగా పనిచేశారు. ఆ సమయంలోనే ఆ ఆస్తుల విలువ అంత ఉంటే.. ఇప్పుడు ఇంకా పెరిగి ఉంటుంది.
Advertisements
- ఇక గుర్‌ప్రీత్‌కు 8 రెసిడెన్షియల్, 4 అగ్రికల్చరల్, 3 కమర్షియల్ నిర్మాణాలు, ప్లాట్లు ఉన్నాయి. మొత్తం 16 వరకు స్థిరాస్తులు ఉన్నాయి.
- ఢిల్లీలోని బరాఖంబా రోడ్డులో రూ.85 లక్షల విలువ చేసే కమర్షియల్ ప్లాట్, సైనిక్ ఫామ్స్‌లో 1500 చదరపు గజాల ఖాళీ స్థలం
- మొహాలీలోని బరియాలిలో వ్యవసాయానికి పనికిరాని రూ.45 కోట్ల విలువ చేసే బంజరు భూమి ఉన్నాయి.
ఇవన్నీ తనకు తన పూర్వీకుల నుంచి సంక్రమించినవే అని గుర్‌ప్రీత్ వెల్లడించారు.
కాగా గుర్‌ప్రీత్ 2009 నుంచి 2013 మధ్య, 2015 తరువాత మొహాలీ ఎస్ఎస్‌పీగా సేవలు అందించారు. జలంధర్ సిటీ పోలీస్ కమిషనర్‌గా సేవలు అందిస్తున్నారు. ఇక కేంద్ర హోం శాఖ చెబుతున్న లెక్కల ప్రకారం..పంజాబ్‌లోని ఐపీఎస్ ఆఫీసర్ల ఆస్తుల విలువ రూ.500 కోట్లకు పైగానే ఉంటుందని వెల్లడైంది.