Advertisement
1962 … నవంబర్ 14 చైనా ఇండియా యుద్ధం…. అరుణాచల్ ప్రదేశ్ లోని సురనంగ్ ప్రాంతం నుండి చైనా సేన ఇండియా భూభాగంలోకి చొచ్చుకువస్తుంది. అక్కడ రెడీ గా ఉన్న ఇండియన్ ఆర్మీ వారిపై ఎదురుదాడికి దిగింది…కానీ సంఖ్య పరంగా ఎక్కువగా ఉన్న చైనా సేన దాడి ముందు నిలవలేకపోయింది..దానికి తోడు వారి దగ్గర ఆధునిక ఆయుధాలున్నాయ్.
విషయం పై అధికారులకు తెలియడంతో ….ఆ ప్రాంతాన్ని వొదిలి వెనుకకు వోచి ఇంకో ప్రాంతంలో ఉన్న ఆర్మీ తో జాయిన్ అవ్వండి ..ఆ ప్రాంతాన్ని వాళ్ళకొదిలేయండి అని చెప్పారు. భారత భూమిని చైనా వాళ్లకు వదలడం ఇష్టం లేని …ఓ సైనికుడు యుద్దానికి దిగాడు …ఒక్కడే ౩ రోజులు చైనా ఆర్మీ తో పోరాడి సుమారు ౩౦౦ మంది ప్రత్యర్థులను చంపాడు.
Advertisement
ఇండియన్ పోస్ట్ ప్రాంతంలో అక్కడక్కడా తుపాకులు అమర్చి…. 10 నిమిషాలకొకసారి ఒక్కో ప్రాంతంలోని ఒక్కో తుపాకీతో పేల్చేవాడు…దీంతో చైనా ఆర్మీ చాలా మంది సైనికులున్నారని అయోమయానికి గురయ్యారు…ఆలా ఒక్కడే ౩ రోజులు బోర్డర్ లో యుద్ధం చేసాడు. చివరకు చుట్టుముట్టిన ప్రత్యరులు ….నవంబర్ 17 న గొంతుకోసి ఆ సైనికుడిని చంపేశారు.
Advertisements
ఆ వీర సైనికుడి పేరు….జస్వంత్ సింగ్ రావత్.
విశేషాలు:
- జశ్వంత్ తెగువ కారణంగా అరుణాచల్ ప్రదేశ్ లోని సురనంగ్ ప్రాంతం ఇండియా ఆధీనంలోనే ఉంది.
- జశ్వంత్ వీరోచితంగా పోరాడిన ఆ ప్రాంత పేరును జస్వంత్ ఘాట్ గా మార్చారు.
- జస్వంత్ 1962 లోనే చనిపోయిన …ఆర్మీ లో ఆయన ఉద్యోగాన్ని అలాగే ఉంచి ….సాధారణంగా డ్యూటీ చేస్తే లభించే అన్ని ప్రొమోషన్స్ ఇచ్చారు
Advertisements
ఈ వీరుడి మీద ఓ సినిమా కూడా తీశారు…..WATCH THE MOVIE : 72 Hours