Advertisement
శుక్లా…. “అమ్మ పాలు తాగుంటే ఫేస్ టు ఫేస్ రా…చూసుకుందాం.!” ఇది హిజుబుల్ ముజాహిద్దీన్ తీవ్రవాద సంస్థ కమాండర్ సమీర్ టైగర్ … మన ఆర్మీ మేజర్ రోహిత్ శుక్లా పై చేసిన సవాల్.! 24 గంటలు తిరగక ముందే..రోహిత్ శుక్లా చేతిలో సమీర్ మర్ గయా.!!
ఈ ఘటన 2018 ది…. టెర్రరిస్ట్ ల పని పట్టేందుకు రోహిత్ శుక్లా తీవ్రంగా పనిచేస్తున్నారు. స్థానికుల సహాయంతో వారి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈవిషయం తెల్సుకున్న హిజుబుల్ ముజాహిద్దీన్ సభ్యులు ఇన్ ఫార్మర్లను బెదిరించి… ఓ వీడియో రిలీజ్ చేస్తూ …శుక్లాకు వార్నింగ్ ఇచ్చారు. “సింహాలు వేటాడడం మానేస్తే …కుక్కలు అడవి అంతా మాదే అని తిరుగుతున్నాయ్” అంటూ సినిమా డైలాగ్స్ కూడా కొట్టాడు.
Advertisement
ఈ వీడియో రిలీజ్అయిన మరుసటి రోజు … హిజుబుల్ ముజాహిద్దీన్ సభ్యులు ఓ ఇంట్లో ఉన్నారన్న ఆచూకీ తెల్సుకున్న శుక్లా తన టీమ్ తో కలిసి ఆ ఇంటిని చుట్టుముట్టారు. మొదట ఇంటిపైకి పెట్రోల్ పోసి టార్గెట్ చేశారు. దీంతో ఇంట్లోనుండి కాల్పులు మొదలయ్యాయి. శుక్లా అండ్ టీమ్ ఎన్ కౌంటర్ స్టార్ట్ చేశాడు…10 అంటే 10 నిమిషాల్లో సమీర్ టైగర్ నుదుటిలో బుల్లెట్ దించారు. శుక్లా తల్లిపాల రుణం తీర్చుకున్నాడు.!
ఈ ఘటన లో శుక్లా కుడి చేతిలోకి బుల్లెట్ దూసుకుపోయింది. కొన్ని రోజుల ట్రీట్మెంట్ అనంతరం డిచార్జ్ అయ్యారు.! తన వీరోచిత పోరాటానికి గానూ శుక్లాకు శౌర్యచక్ర అవార్డ్ దక్కింది. ఇది సైన్యంలో మూడవ పెద్ద అవార్డ్ .!
Advertisements
Advertisements