Advertisement
ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అనేక రకాల సంప్రదాయాలు,ఆచార వ్యవహారాలను పాటిస్తుంటారు. మన దేశంలో ప్రతి ఏటా ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తాయి. ఆ సమయంలో ఆ నదిలో స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అయితే రష్యా దేశంలోనూ సరిగ్గా ఇలాంటిదే ఒక సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అదేమిటంటే.
రష్యాలో ఉన్న జోర్డాన్ నదిలో ప్రతి ఏడాది జనవరి 19వ తేదీన జనాలు ఎఫిఫానీ ఐస్-హోల్ బాతింగ్ చేస్తారు. అంటే.. మంచుతో గడ్డ కట్టుకుపోయిన నదిలో మునిగి స్నానం చేస్తారన్నమాట. అవును.. చదువుతుంటేనే ఒంట్లో వణుకు పుడుతుంది కదా.. ఇంక ఆ స్నానం చేసే జనాలు ఎలా ఫీలవుతారో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
Advertisements
Advertisement
రష్యావాసులు వోడోక్రెష్‌చ్ అనే తమ దేవుడి కోసం ఆ విధంగా నదిలో పుణ్య స్నానాలు చేస్తారు. నదిలో దీర్ఘ చతురస్రాకారంలో కొద్దిగా ప్రదేశాన్ని ఐస్ లేకుండా చేస్తారు. పైభాగంలో ఉన్న మంచు గడ్డలను తొలగించి నీళ్లు వచ్చేలా దీర్ఘ చతురస్రాకారంలో ఏర్పాటు చేస్తారు. దాని చుట్టూ తాత్కాలికంగా కర్రలతో ఫ్రేమ్‌లను ఏర్పాటు చేస్తారు. అనంతరం ఆ చిన్న ఐస్ హోల్‌లో మునిగి 3 సార్లు అటు, ఇటు చేరుకోవాలి. దీంతో మునక పూర్తవుతుంది.
ఇలా గడ్డ కట్టిన నదిలో చలికాలంలో స్నానం చేయడం అక్కడ ఎప్పటి నుంచో సంప్రదాయంగా వస్తోంది. దీన్ని ఆ దేశానికి చెందిన అనేక మంది పాటిస్తూ వస్తున్నారు. సాక్షాత్తూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఏటా ఆ నదిలో అలా మునక వేస్తారు.
Advertisements
ఇక అలా చేయడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి అదేమీ జరగదు. ఆ రోజు ఎంతో పవిత్రమైన రోజు కనుక నదిలో అలా స్నానం చేస్తే శరీరానికి హాని కలగకపోగా.. ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని వారు భావిస్తారు. ముఖ్యంగా శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, జలుబు అస్సలే చేయదని వారు నమ్ముతారు. అలాగే స్నానం చేశాక చాలా మంది వోడ్కాను కూడా సేవిస్తారు. ఏది ఏమైనా.. ఈ సంప్రదాయం భలే వింతగా ఉంది కదా..!