Advertisement
రైలు పట్టాలు ఇనుముతో చేసి ఉంటాయి…ఎండకు ఎండి, వానకు తడిసే ఆ పట్టాలు మరి తుప్పు పట్టవా? అనే డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా? అయితే ఇదిగో ఆన్సర్….. రైలు పట్టాలు ఇనుముతో చేసేవే అయినప్పటికీ….వాటికి వినియోగించే ఉక్కు అధిక నాణ్యత కలిగినదై ఉంటుంది. ఈ ఉక్కులో 0.7% కార్బన్ మరియు 1% మాంగనీస్ కలిపి ఉంటుంది…అందుకే దీనిని ‘సి-ఎంఎన్’ రైల్ స్టీల్ అని పిలుస్తారు, దీని కారణంగా తుప్పు పట్టడం చాలా తక్కువ!
Advertisements
Advertisement
- ఒకవేళ తుప్పు పట్టినా….తుప్పు రేటు సంవత్సరానికి 0.05 మిమీ ఉంటుంది, అంటే 1 మిమీ మేర తుప్పు పట్టడానికి 20 సంవత్సరాలు పడుతుంది.
- ఇక పట్టాలపై ఎప్పుడు రైలు ప్రయాణిస్తూనే ఉంటుంది కాబట్టి….ఘర్షణ కారణంగా పట్టాలెప్పుడు పాలిష్ చేసిన మాదిరి మెరుస్తుంటాయి…సో తుప్పు పట్టే అవకాశాలు తక్కువగా ఉంటాయి!
- దీనికి తోడు… కొంచెం పట్టాలు తేడా అనిపించినా రైల్వే సిబ్బంది వెంటనే ఆ పట్టాలను మార్చేస్తుంటారు.
- రైలు పట్టాలకు తుప్పు పట్టకుండా ఓ కోటింగ్ వేస్తారు!
Advertisements