Advertisement
ప్రస్తుతం మనకు అనేక రకాల ఎలక్ట్రిక్ బ్యాటరీలు అందుబాటులో ఉన్నాయి. అనేక పరికరాల్లో భిన్న రకాల బ్యాటరీలను ఉపయోగిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్లు, టీవీ రిమోట్లు, వాహనాలు.. ఇలా రకరకాల వస్తువుల్లో భిన్న రకాల శక్తి సామర్థ్యాలు, సైజులు ఉన్న బ్యాటరీలను వాడుతున్నారు. అయితే నిజానికి చాలా వరకు ఎలక్ట్రిక్ బ్యాటరీలలో ఒకే తరహా విధానంలో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడున్న బ్యాటరీలను నిజానికి అగస్త్యుడు అప్పట్లోనే తయారు చేశాడు. అవును.. ఆయన అప్పట్లో మట్టి కుండలను ఉపయోగించి విద్యుత్ బ్యాటరీలను తయారు చేయగా.. సరిగ్గా వాటిని పోలిన బ్యాటరీలనే మనం ఇప్పుడు వాడుతున్నాం.
అగస్త్య మహాముని రచించిన అగస్త్య సంహితలో ఎలక్ట్రికల్ బ్యాటరీ తయారీ గురించిన విధానాన్ని మనం పరిశీలించవచ్చు. ఇప్పుడు అధునాతన సాంకేతిక పరికరాలు ఉన్నాయి. కానీ అప్పట్లో ఆయన మట్టి కుండల్లో విద్యుత్ బ్యాటరీని తయారు చేశాడు. నీళ్లను ఆక్సిజన్, హైడ్రోజన్‌లుగా విడగొట్టడం ద్వారా ఆయన ఎలక్ట్రిక్ బ్యాటరీని తయారు చేశాడు. సరిగ్గా అదే మెథడ్‌తో ఇప్పటి బ్యాటరీలు పనిచేస్తుండడం విశేషం.
Advertisement
అగస్త్యుడు తెలిపిన విధంగా ఎలక్ట్రికల్ బ్యాటరీని తయారు చేసేందుకు.. ఒక మట్టి కుండ, కాపర్ ప్లేటు, కాపర్ సల్ఫేట్, తడి రంపపు పొట్టు, జింక్ అమాల్గం అవసరం అవుతాయి.
Advertisements
Advertisements
సంస్థాప్య మృణ్మయే పాత్రే తామ్రపత్రం సుసంస్కృతం |
ఛాదయేచ్ఛిఖిగ్రీవేన చాద్రాభిః కాష్టాపాంసుభిః ||
దస్తాలోష్టో నిధాత్వయః పారదాచ్ఛాదితస్తతః |
సంయోగాజ్జాయతే తేజో మిత్రావరుణసంయితం ||
పైన తెలిపిన దానికి అర్థం ఏమిటంటే… మట్టికుండలో బాగా శుభ్రం చేసిన కాపర్ ప్లేట్‌ను ఉంచాలి. ముందుగా కుండలో కాపర్ సల్ఫేట్, తడి రంపపు పొట్టును పోయాలి. అనంతరం అందులో రంపపు పొట్టుపై మెర్క్యురీ అమాల్గమేటెడ్ జింక్ షీట్లను ఉంచాలి. దాంతో అందులో మిత్ర-వరుణ అని పిలవబడే శక్తి ఉత్పన్నం అవుతుంది. దీని వల్ల నీరు.. ప్రాణవాయు, ఉదానవాయులుగా విభజించబడుతుంది. 100 కుండలను ఉపయోగిస్తే కావల్సినంత శక్తిని ఉత్పత్తి చేయవచ్చు.
ఈ విధంగా ఎలక్ట్రికల్ బ్యాటరీని తయారు చేస్తే వచ్చే సర్క్యూట్ వోల్టేజ్ 1.138 వోల్టులుగా ఉంటుంది. అందులో 23 మిల్లీయాంప్స్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇలా అగస్త్య సంహితతో ఎలక్ట్రికల్ బ్యాటరీలను తయారు చేయవచ్చు. అప్పట్లోనే రుషులు నిజంగా ఇలాంటి ఆవిష్కరణ చేశారంటే అది చాలా గొప్ప విషయం అని చెప్పవచ్చు.