Advertisement
ఐఏఎస్ ఉద్యోగానికి ఎంపిక అవడం అంటే మామూలు విషయం కాదు. అందుకు ఎంతో కష్టపడాలి. చాలా మంది ఐదారు సార్లు యూపీఎస్సీ రాసి ఐఏఎస్ కోసం యత్నిస్తుంటారు. ఏటా కొన్ని లక్షల మంది యూపీఎస్సీ రాసి ఐఏఎస్ అవ్వాలని చూస్తారు. కానీ వారిలో కేవలం 80 నుంచి 90 మంది మాత్రమే ఎంపికవుతారు. దేశంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో యూపీఎస్సీ పరీక్ష ఒకటి. అయితే యూపీఎస్సీ పరీక్ష రాసి ఐఏఎస్ గా సెలెక్ట్ అయితే చాలు.. జీవితమే మారిపోతుంది. ఎప్పటికప్పుడు వేతనం పెరుగుతుంది. ప్రమోషన్లు లభిస్తాయి. జీవితం హ్యాపీగా గడుస్తుంది. ఈ క్రమంలో ఒక అభ్యర్థి ఐఏఎస్‌కు ఎంపికై రిటైర్ అయ్యేవరకు ఆరంభం నుంచి చివరి వరకు ఎంత జీతం సంపాదిస్తాడు, రిటైర్ అయ్యేటప్పుడు ఏ బాధ్యతలో ఉంటాడు.. అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
7వ పే కమిషన్ ప్రకారం ఐఏఎస్ శాలరీ బేసిక్ పే + డీఏ + టీఏ + హెచ్ఆర్ఏలను కలిపి ఉంటుంది.
చెల్లించే స్థాయి – 10
ఇందులో బేసిక్ పే రూ.56,100 ఉంటుంది. ఐఏఎస్ కెరీర్‌లో మొదటి ఏడాది నుంచి 4వ సంవత్సరం వరకు పని చేయాలి. ఏఎస్‌పీ, ఎస్‌డీఎం, అసిస్టెంట్ కమిషనర్ హోదాలో పనిచేయాలి.
చెల్లించే స్థాయి – 11
ఈ లెవల్‌లో రూ.67,700 జీతం ఇస్తారు. కెరీర్‌లో 5వ ఏడాది నుంచి 8వ ఏడాది వరకు ఈ లెవల్‌లో పనిచేయాలి. ఏడీఎం, డిప్యూటీ సెక్రెటరీ, అండర్ సెక్రెటరీ పోస్టులలో పనిచేయాల్సి ఉంటుంది.
Advertisements
చెల్లించే స్థాయి – 12
ఈ లెవల్‌లో రూ.78,800 జీతం ఇస్తారు. కెరీర్‌లో 9వ ఏడాది నుంచి 12వ ఏడాది వరకు పోస్టుల్లో పనిచేయాలి. డీఎం, జాయింట్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ పోస్టులు ఇస్తారు.
Advertisement
చెల్లించే స్థాయి – 13
రూ.1,18,500 జీతం ఇస్తారు. డీఎం, స్పెషల్ సెక్రెటరీ కమ్ డైరెక్టర్ లేదా డైరెక్టర్ పోస్టుల్లో కెరీర్‌లో 13వ ఏడాది నుంచి 16వ ఏడాది వరకు పనిచేయాలి
చెల్లించే స్థాయి – 14
రూ.1,44,200 జీతం ఇస్తారు. డివిజనల్ కమిషనర్, సెక్రెటరీ కమ్ కమిషనర్ లేదా జాయింట్ సెక్రెటరీ పోస్టుల్లో కెరీర్‌లో 16వ ఏడాది నుంచి 24వ ఏడాది వరకు సేవలందించాలి.
చెల్లించే స్థాయి – 15
రూ.1,92,200 జీతం ఇస్తారు. డివిజనల్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రెటరీ లేదా అడిషనల్ సెక్రెటరీ పోస్టుల్లో కెరీర్‌లో 25వ ఏడాది నుంచి 30వ ఏడాది వరకు పనిచేయాలి. దీంతో 30 ఏళ్ల సర్వీస్ పూర్తవుతుంది.
చెల్లించే స్థాయి – 16
రూ.2,05,400 వేతనం ఇస్తారు. కెరీర్‌లో 30వ ఏడాది నుంచి 33వ ఏడాది వరకు పనిచేయాలి. అడిషనల్ చీఫ్ సెక్రెటరీ పోస్టు ఇస్తారు.
చెల్లించే స్థాయి – 17
రూ.2.25 లక్షల వేతనం ఇస్తారు. కెరీర్‌లో 34వ ఏడాది నుంచి 36వ ఏడాది వరకు.. అంటే 3 ఏళ్ల పాటు చీఫ్ సెక్రెటరీగా పనిచేయాలి.
చెల్లించే స్థాయి – 18
రూ.2.250 లక్షలు ఇస్తారు. 37 ఏళ్లకు పైగా కెరీర్ ఉన్నవారికి క్యాబినెట్ సెక్రెటరీ ఆఫ్ ఇండియా పోస్టు ఇస్తారు.
ఇక ఐఏఎస్‌గా జాయిన్ అయ్యే సమయంలో ఇచ్చే డీఏ 0 శాతమే. అయినప్పటికీ సర్వీస్ పెరుగుతున్న కొద్దీ దాన్ని పెంచి ఇస్తారు. ఇక ఒక బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారులకు ఒకే సమయంలో జీతాల పెంపు, ప్రమోషన్లు ఉంటాయి. ఆరంభంలో వేతనంలో బేసిక్ శాలరీపై 3 శాతం ఇంక్రిమెంట్ వేస్తారు. క్యాబినెట్ సెక్రెటరీ స్థాయిలో ఫిక్స్‌డ్ వేతనం ఉంటుంది. ఇక ఎంట్రీ లెవల్‌లో ఏడాదికి 0 నుంచి 14 శాతం చొప్పున డీఏను పెంచుతారు. 37 ఏళ్ల కెరీర్‌కు చేరుకునే సరికి అత్యధిక డీఏను పొందుతారు.
Advertisements