Advertisement
హీరోయిన్లు అమ్మ, అక్క, వదిన పాత్రలకి ప్రమోట్ అవుతుంటే మన హీరోలు మాత్రం అరవై ఏళ్లు పై బడినా ఇంకా కుర్రహీరోలుగానే చలామణి అవుతున్నారు..వారి పక్కన నటించే హీరోయిన్లకు వాళ్లకు మధ్య ఇంచుమించు సుమారు 20-25 ఏళ్లు తేడా ఈజీగా ఉంటుంది.. వీళ్లే మళ్లీ యంగ్ హీరోల సరసన యాక్ట్ చేయడానికి రెడీ అయిపోతుంటారు..ఒకే ఫ్యామిలికి చెందిని అటు సీనియర్స్ తో, ఇటు జూనియర్ స్టార్స్ తో…టూ జనరేషన్స్ తో యాక్ట్ చేసిన హీరో హీరోయిన్లు ఎవరో చూద్దామా..
శ్రీదేవి..
అతిలోక సుందరి శ్రీదేవి..ఎవరైతే NTR,ANR, కృష్ణ, శోభన్ బాబు ఇలా ఆ తరం నటుల సరసన నటించింది.. తర్వాత వచ్చిన రెండో తరం నటుల పక్కన కూడా యాక్ట్ చేసి రెండు జనరేషన్స్ తో యాక్ట్ చేసిన ఏకైక హీరోయిన్ గా ఆరోజుల్లో క్రెడిట్ కొట్టేసింది..నిజానికి బాలక్రిష్ణ,నాగార్జున సరసన యాక్ట్ చేయడానికి శ్రీదేవి అపోజ్ చేసిందట..వాళ్ల తండ్రుల పక్కన నటించాను.. ఇప్పుడు వారి పక్కన నటించలేను అని తెగేసి చెప్పిందట..
అందుకే చిరంజీవి,వెంకటేశ్ తదితరులతో యాక్ట్ చేయడానికి ఒకె గానీ నాగార్జున , బాలకృష్ణ పక్కన నటించను అని చెప్పినా.. నాగార్జున పట్టుబట్టి తన సినిమాలో యాక్ట్ చేసేలా ఒప్పించారని అంటుంటారు..ఆఖరి పోరాటం, గోవిందా గోవిందా సినిమాల్లో నాగార్జున పక్కన నటించింది.. ఆ రెండు సినిమాల్లోనూ వారిద్దరి జోడి సూపర్ గా కుదిరి.. మూడో తరంతో యాక్ట్ చేసిన తరగని అందం శ్రీదేవిది అని కామెంట్ చేసేవారు..ఎంతైనా అతిలోక సుందరి కదా..!
Advertisements
కాజల్..
శ్రీదేవి తర్వాత ఆ క్రెడిట్ కొట్టేసిన నటి కాజల్.. రెండు తరాల యాక్టర్స్ తోనే కాదు.. ఒకే కుటుంబంలో నలుగురు హీరోలతో నటించిన క్రెడిట్ కూడా కాజల్ దే..మెగా ఫ్యామిలిలో చిరుతో ఖైది నెం150లో,పవన్ తో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో, చరణ్ తో మగధీర, ఎవడు,నాయక్, గోవిందుడు అందరివాడే సినిమాల్లో యాక్ట్ చేసింది. అల్లు అర్జున్ ఆర్యా2,ఎవడు సినిమాలో నటించింది.
తమన్నా..
మిల్కి బ్యూటి తమన్నా మెగా ఫ్యామిలి హీరోలందరితో నటించారు.. పవన్ కళ్యాన్ తో కెమెరామాన్ గంగతో రాంబాబు, చరణ్ తో రచ్చ, అల్లు అర్జున్ తో బద్రీ నాధ్ సినిమాలలో నటించిన తమన్నా రీసెంట్ గా సైరాలో చిరు పక్కన యాక్ట్ చేసింది. జిగిరి దోస్తులు కాజల్ ,తమన్నా ఇద్దరూ ఒకే క్రెడిట్ కొట్టేసారు..
రకుల్ ప్రీత్ సింగ్..
అక్కినేని కుటుంబంతో యాక్ట్ చేసిన హీరోయిన్ గా క్రెడిట్ కొట్టేసింది రకుల్.. శ్రీదేవి నాగ్ ,ఎఎన్నార్ లతో యాక్ట్ చేస్తే..రకుల్ నాగ్, చైతూలతో యాక్ట్ చేసింది..నాగ్ తో మన్మధుడు2, చైతుతో రారండోయ్ వేడుక చూద్దాం సినిమాల్లో యాక్ట్ చేసింది.
త్రిష..
సీనియర్స్ తో యాక్ట్ చేయను అని ఒకప్పుడు భీష్మించుకు కూర్చున్న త్రిష ..అవకాశాలు వెనుక పడడంతో ఒక మెట్టు దిగి రాకతప్పలేదు.. బాబాయ్ ,అబ్బాయ్ బాలయ్య,NTR ఇద్దరితో యాక్ట్ చేసింది త్రిష..దమ్ము సినిమాలో NTRతో జతకట్టిన త్రిష,లయన్ సినిమాలో బాలకృష్ణ సరసన నటించింది.
Advertisement
అనుష్క శెట్టి..
అనుష్క దగ్గుబాటి కుటుంబానికి చెందిన రెండు తరాల వారితో నటించింది.. చింతకాయల రవి, నాగవల్లి లో వెంకటేష్ సరసన, రుద్రమ దేవిలో రానా తో నటించింది..
ఛార్మి..
పద్నాలుగేళ్లకే ఇండస్ట్రీకి పరిచయం అయి ప్రస్తుతం ప్రొడ్యుసర్ గా సెటిల్ అయిపోయిన పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మీ కౌర్ కూడా బాలకృష్ణతో అల్లరి పిడుగులో , రాఖీ సినిమాలో యంగ్ టైగర్ సరసన నటించింది.
జెనిలియా..
బొమ్మరిల్లులో..హాహా హాసినిగా అలరించిన జెనిలియా..పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయింది..ఈ భామ కూడా దగ్గుబాటి కుటుంబానికి చెందిన వెంకటేశ్ తో సుభాష్ చంద్రబోస్ లో నటించి,ఏడేళ్ల తర్వాత రానాతో నా ఇష్టం సినిమాలో నటించింది..
శ్రేయ..
సీనియర్స్ జూనియర్స్ అని తేడాలేకుండా అందరి పక్కన సూట్ అయ్యే హీరోయిన్ శ్రేయ..బాలకృష్ణతో చెన్నకేషవరెడ్డి, గౌతమీ పుత్ర శాతకర్ణిలో యాక్ట్ చేసిన శ్రేయ, ఎన్టీయార్తో నా అల్లుడు సినిమాలో జతకట్టింది.
నయనతార..
ఒకవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో దూసుకుపోతూనే మరోవైపు స్టార్ హీరోల సినిమాల్లో చిన్న పాత్ర వచ్చినా వదలకుండా యాక్ట్ చేస్తుంది నయనతార.. ఈమె రెండు కుటుంబాలకు సంబంధించిన ఇద్దరు హీరోలతో యాక్ట్ చేసింది.. దగ్గుబాటి కుటుంబానికి చెందిన వెంకటేష్ తో బాబు బంగారం,తులసి,లక్ష్మి సినిమాల్లో నటించింది.వెంకీ-నయన్ లది హిట్ పెయిర్., రానా సరసన కృష్ణం వందే జగద్ఘురుంలో నటించింది..అలాగే నందమూరి వారసులు బాలకృష్ణ ,ఎన్టీయార్ లకి జోడిగా నటించింది.బాలక్రిష్ణ సరసన సింహా,జై సింహా, శ్రీరామరాజ్యంలో నటించగా..ఎన్టీయార్ తో అదుర్స్ లో యాక్ట్ చేసింది.
శృతిహాసన్..
ఐరన్ లెగ్ గా కామెంట్ చేసిన వాళ్లే గబ్బర్ సింగ్ హిట్ తో ఒక్కసారిగా శృతిది గోల్డెన్ లెగ్ ని పొగిడారు..ఆ సినిమాలో పవన్ సరసన నటించిన శృతి తర్వాత ఎవడు లో రాంచరణ్, అల్లు అర్జున్ పక్కన నటించింది.. బన్నితో రేసుగుర్రంలో కూడా నటించింది.
Advertisements
ఆర్తి అగర్వాల్..
చిన్న వయసులో అందరికి దూరం అయిన ఆర్తి అగర్వాల్ చేసినవి కొన్ని సినిమాలైనా అన్ని తనకి మంచి గుర్తింపు నిచ్చాయి..ఇక రెండు జనరేషన్ల విషయానికి వస్తే బాలకృష్ణతో పల్నాటి బ్రహ్మనాయుడులో, జూ ఎన్టీయార్ తో అల్లరి రాముడులో నటించింది.