Advertisement
ఓ సినిమా రిలీజ్ చేయాలంటే…. అన్ని రకాల కాలిక్యులేషన్స్ వేస్తారు. ఇతర సినిమాలేమైనా ఉన్నాయా? రిలీజింగ్ కి ఇది కరెక్ట్ టైమేనా? అని బట్ అలా కాకుండా ఒకే హీరోకు చెందిన రెండు సినిమాలు ఒకే రోజు రిలీజైతే…? అదే జరిగింది మన టాలీవుడ్ లో., NTR ఈ విధానానికి నాంది పలికాడు. అప్పట్లో సినిమాలు చాలా తక్కువగా రిలీజ్ అయ్యేవి కాబట్టి ఒకే రోజు ఒకే హీరోకు చెందిన రెండు సినిమాలను రిలీజ్ చేశారు. ఇప్పుడు సీన్ మారింది. ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు సైతం ఒకే రోజు విడుదల చేయకుండా జాగ్రత్త పడుతున్నారు..కారణం ఒపెనింగ్ కలెక్షన్స్ !
6 సందర్భాలలో ….ఒకే హీరో నటించిన సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం!
1. NTR
ఫస్ట్ టైం ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ చేసి రికార్డ్ సృష్టించిన హీరో NTR . 1959 జనవరి14 న అప్పుచేసి పప్పు కూడు , సంపూర్ణ రామాయణం ఈ రెండు సినిమాలు రిలీజయ్యాయి. రెండో సారి కూడా మళ్లీ ఈ ఫీట్ NTR సాధించారు… 1961 మే 5 న పెండ్లి పిలుపు , సతీసులోచన విడుదలయ్యాయి.
Advertisements
2. శోభన్ బాబు
శోభన్ బాబు నటించిన లక్ష్మీ విలాసం , పంతాలు పట్టింపులు ఒకే రోజున( 1968 జులై 19) విడుదలయ్యాయి.
Advertisement
3. చిరంజీవి
1980 లో మెగాస్టార్ చిరంజీవి నటించిన కాళి , తాతయ్య ప్రేమలీలలు ఈ రెండు మూవీస్ సెప్టెంబర్ 19 న రిలీజయ్యాయి . వీటిలో కాళి సినిమాలో రజినీకాంత్ మెయిన్ హీరో. 1982 అక్టోబర్ 01 న మాత్రం చిరంజీవి హీరోగా నటించిన పట్నం వచ్చిన పతివ్రతలు , టింగు రంగడు రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి.
4. క్రిష్ణ
సూపర్ స్టార్ క్రిష్ణ హీరోగా నటించిన యుద్ధం , ఇద్దరు దొంగలు మూవీస్ జనవరి 14 1984 లో ఒకే రోజు రిలీజయ్యాయి.
5. బాలక్రిష్ణ
బాల క్రిష్ణ బంగారు బుల్లోడు , నిప్పు రవ్వ మూవీస్ రెండు ఒకే రోజు (1993 సెప్టెంబర్ 03 ) న రిలీజయ్యాయి.
6. నాని
ఇక చివరిసారిగా 2015 లో నాని రెండు మూవీస్ ఒకే రోజు రిలీజయ్యాయి . మార్చ్ 21న ఎవడే సుబ్రహ్మణ్యం , జెండాపై కపిరాజు సినిమాలతో ఈ ఘనత సాధించాడు నాని.
Advertisements