Advertisement
పెట్రోలింగ్ పాయింట్-14 వద్ద చైనా గుడారాలు వేసుకుంది.! ఒప్పందం ప్రకారం ఏ దేశ సైనికులు అక్కడ అలా ఉండకూడదు. దాని పర్యవేక్షణ బాధ్యతను సంతోష్ కమాండింగ్ ఆఫీసర్ గా ఉన్న 16 బీహార్ రెజిమెంట్ కు అప్పజెప్పింది ఇండియన్ ఆర్మీ.!
జాన్ 14 న తన ట్రూప్ తో వెళ్లిన సంతోష్ బాబు…ఇదే విషయాన్ని చైనా ఆఫీసర్ కు వివరించాడు. ఓకే అని వెనక్కి వెళ్లిన చైనా జాన్ 15 న మరింత మంది సైన్యంతో మళ్లీ అక్కడికి చేరుకుంది.
మరల…వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్న సంతోష్ బాబును .. చైనా సైనికుడు ఒకడు బలంగా తోశాడు. మా CO ( కమాండింగ్ ఆఫీసర్) సాబ్ నే తోస్తావా? అంటూ మన సైనికులు కోపంతో ఆ సైనికుడిని నెట్టారు. ఇలా ఒకరినొకరు కొట్టుకున్నారు… అప్పటికే అదనపు బలగాలను తెచ్చుకున్న చైనా…. మేకులున్న కర్రలతో దాడి చేసింది. మన సైనికులు 100 మంది ఉంటే చైనా వాళ్లు సుమారు 350 దాకా ఉన్నారు.
Advertisement
Advertisements
Advertisements
సంతోష్ బాబు తలకు రాయి తగిలింది. రక్తం కారుతున్నా తన ట్రూప్ లో ధైర్యాన్ని నింపాడు కల్నల్ సాబ్… ఒకవైపు గాయపడిన సైనికులను వెనక్కి పంపుతూనే అదనపు బలగాలను రప్పించాడు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ ఘర్షణలో ఇరుదేశాల సైనికులు గాల్వాన్ నదిలో పడిపోయారు. సంతోష్ బాబు కూడా ఆ నదిలో పడి అమరుడయ్యాడు. మరునాడు ఉదయం నదిలో పడిపోయిన చైనా సైనికులను వారికి అప్పగించింది మన ఆర్మీ.!
#వీర జవాన్లకు సెల్యూట్.!