Advertisement
ఒక విడియో గత 3రోజులు నుండి సోషల్ మీడియా లో చాలా హల్ చల్ చేస్తుంది…అబ్బబ్బా ఏం ఫైట్ ఏం ఫైట్ ఏం చేశార్రా బాబూ అని నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.. ట్విటర్, ఇన్స్టా ,ఫేస్బుక్ ,వాట్సప్ ఏ సోషల్ మీడియా ఫ్లాట్ఫ్మాం చూడు ఆ వీడియో గురించే చర్చ నడుస్తోంది..మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే… ఎవరబ్బా అంతలా దుమ్ముదులిపిన హీరో అనుకుంటే తప్పులో కాలేసినట్టే..
పట్టుమని పదహారేళ్లు నిండని కుర్రాడు పెద్దపెద్ద డైరెక్టర్లకు దీటుగా ఒక సినిమాలో సన్నివేశం చిత్రీకరించడం.. పది పన్నేండేళ్ల పిల్లలు స్టార్ హీరోకి సాటిగా యాక్ట్ చేయడం.. చూడడానికి రెండు కళ్లు చాలవు.. చూసినవాళ్లు ఫిదా అవ్వకుండా ఉండరు..వాళ్లూ వీళ్లు కాదు డైరెక్ట్ గా సరిలేరు ఎవ్వరూ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన ట్విట్టర్ లో షేర్ చేసి మెచ్చుకున్నాడు అంటే.. న్యూస్ ఛానెల్స్ వాళ్ల ఇంటర్వ్యూ కోసం పరుగులు పెట్టాయంటే వాళ్ళు ఎంత లా ఇంప్రెస్స్ చేసి ఉంటారు..
Advertisement
మహేష్ బాబు పుట్టినా రోజు సందర్భంగా నెలూరు కి చెందిన కిరణ్ అనే మహేష్ బాబు అభిమాని తన అభిమానం ను వీడియో ద్వారా చెప్పాడు…ఇలాంటి విషెస్ తన అభిమానులనుండి మహేశ్ ఇంతకుముందు అందుకుని ఉండడు.ఇకపై అందుకోడేమో.. మరీ ఆ పిల్లల్ని ఆకాశానికి ఎత్తేస్తున్నామా.. ఆ ఫైట్ చూస్తే మీరు నాకంటే ఎక్కువ ఫీలవుతారు..కొన్ని కోట్లు పెట్టి తీసే ఫైట్ సీను కేవలం ఫోన్ కెమెరా తో మూవీ లో ఎలాగా ఉందో అలా తీశాడు…ఫర్ఫెక్ట్ మేకింగ్.. ఎమోషన్స్ ఎక్కడ మిస్స్ అవ్వకుండా… పెద్ద వాళ్ళు చేసే ఫైట్స్ ను చిన్న పిల్లలతో తీయడం చాలా గ్రేట్… పిల్లలు కదా అని అనుకుంటే మన తప్పు… వాళ్ళ స్క్రీన్ ప్రెసెంట్ కి వాహ్ అనకుండా ఉండలేరు..
తొమ్మిదో తరగతి చదివే కిరణ్ కి సినిమాలంటే ఆసక్తి ట్రైనింగ్ తీసుకుంటా అని ఇంట్లో ఎప్పుడూ పోరుతుండేవాడు..తండ్రి లేడు.. తల్లి చేపలమ్ముకుని జీవనం సాగిస్తుంది.. కొడుకు ఆశపడుతున్నాడని అప్పుచేసి మరీ హైదరాబాద్లో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసింది.. మనోడికి అక్కడ అస్సలు నచ్చక మళ్లీ వచ్చిన రూట్లోనే నెల్లూరు వెనక్కి వెళ్లిపోయాడు.. నాకు నచ్చలేదు.. అని చెప్తే తల్లి కూడా ఏమనలేకపోయింది..
Advertisements
మనోడి టాలెంట్ నిరూపించుకోవడానికి మహేశ్ బర్త్ డే మంచి అవకాశంగాదొరికింది…వెంటనే తన ఫ్రెండ్స్ కి చెప్పాడు.. వాళ్లు మంచి ఐడియా అన్నారు.. నీకు హెల్ప్ చేస్తాం అని మాటిచ్చారు..ఒకరిద్దరు సరిపోరు..వెంటనే వాళ్ల కాలనిలో పిల్లల్నే తన సీన్స్ కి సెలక్ట్ చేసుకున్నాడు.. సరిలేరు నీకెవ్వరు సినిమాలోని రెండు ఫైట్స్ సీన్స్ ని ఎంచుకుని మొబైల్ తో షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు.. మహేశ్ బర్త్ డే నెక్స్ట్ డేకి సోషల్ మీడియా అంతట ఈ వీడియోలే.. ఆ వీడియోపై మీరూ లుక్కేయండి…
Watch Sarileru Fighr spoof :
Advertisements