Advertisement
సాహోరే బాహుబలి సాంగ్ తో శనివారం బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున టైం వేస్ట్ చేయకుండా వెంటనే ఐదవ రోజు బిగ్ బాస్ హౌస్ లో జరిగే విషయాలను ప్రేక్షకులకు చూపించడానికి మన టీవీ లోకి వెళ్ళిపోయారు.
టాస్క్ లోనే కాకుండా బిగ్ బాస్ హౌస్ లో కూడా సూపర్ వైజర్ గా తనని తాను నియమించుకున్నట్లు సూర్య కిరణ్ వ్యవహరిస్తారని అభిజిత్, హారిక అభిప్రాయపడ్డారు.ఇక గంగవ్వ,అరియానా మాట్లాడుతుంటే మధ్యలో వచ్చిన రాజశేఖర్ మాస్టర్ ఎక్కడ పుట్టామో ఎక్కడ పెరిగామో ఇక్కడికి వచ్చాము అనే ఫిలాసఫీ ని స్టార్ట్ చేశారు.
ఇక స్విమ్మింగ్ పూల్ లో అబ్బాయిలు అందరూ ఉన్న టైంలో మోనాల్ హారిక అబ్బాయిలు హాట్ గా ఉండే అంశంపై మాట్లాడుకున్నారు.అందరూ సరదాగా కూర్చున్న సమయంలో పాట పాడడానికి కరాటే కళ్యాణి ముందుకు వచ్చింది.ఆ టైంలో అమ్మ రాజ శేఖర్ మాస్టర్ మిగతా ఇంటి సభ్యులతో కలిసి ముందుగా ప్లాన్ చేసినట్లు అక్కడ నుండి లేచి వెళ్ళిపోయి ఫన్ జనరేట్ చేశారు.
ఇక లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో వచ్చిన పాయింట్స్ తో నిత్యావసర వస్తువులను తీసుకోవడంలో ఇంటి సభ్యులు బాగా బిజీ అయ్యారు.ఆ టైంలో ఇంటి సభ్యుల వ్యవహార తీరుపై అసహనం వ్యక్తం చేసిన సాయి కిరణ్.
Advertisements
దీనిపై మోనాల్ తో మళ్లీ గంగవ్వ తో కొద్దిసేపు డిస్కస్ చేశారు.మనకి ఏం కావాలో ముందే క్లారిటీ ఉండాలిగా అని అన్నారు.ఇక వర్షం పడుతున్న టైంలో కలిసి కూర్చున్న అభిజిత్, హారిక గివ్ మీ సన్ షైన్ పాటను కలిసి పాడుకున్నారు.ఆ తర్వాత ఇంటి సభ్యులను మన టీవీ ద్వారా కలిసిన నాగార్జున కరాటే కళ్యాణి చీర బాగుంది అని ఆది చూడలేక చచ్చిపోతున్నాం, ఏమంటావ్ అభిజిత్ అని అన్నారు.
ఇక గంగవ్వను రాత్రి నిద్ర పోనివ్వట్లేదని దానికి కారణం ఇంటి సభ్యులు గదిలో అర్ధరాత్రి డిస్కషన్ పెట్టడమని నాగార్జున అభిప్రాయపడ్డారు.అలాగే గంగవ్వ అప్పుడప్పుడు మాట్లాడేది అర్థం కావట్లేదని ఆమె మాటలు క్లియర్ గా ప్రేక్షకులకు అర్థమయ్యేటట్టు చెప్పే బాధ్యతను సుజాతకి అప్పజెప్పారు.
ఇక నోయల్ గంగవ్వతో ఎంత కనెక్ట్ అయ్యారు అని అడిగితే దానికి నోయల్ లవ్ లెటర్ రాసేంత కనెక్ట్ అయ్యానని చెప్పారు.అదే టైంలో ఇంటి సభ్యులలో చాలామంది నోయల్ ఓవర్ గా థింక్ చేస్తారని అభిప్రాయపడ్డారు.. దాన్ని ఆయన మార్చుకోవాలని నాగార్జున సూచించారు.
ఆతరువాత సోహైల్, అరియానాను తన పైన కూర్చోబెట్టుకొని పుషప్స్ చేశాడు.ఇక రోజూ షోలో ఏడుస్తున్న మోనాల్ కు నాగార్జున నర్మద అనే ముద్దు పేరు పెట్టారు.అలాగే ఆమెను కోపంతో ఎవరికి అన్నం పెట్టవద్దని సూచించారు.
Advertisement
సుజాత బాగా ఆడుతున్నావు బట్ కొంచెం ఎమోషనల్ అవుతున్నావని,ఇక లాస్య తనలా లేదని ఏదో వెలితి కనిపిస్తుందని జోష్ తగ్గిందని ,అలాగే మెహబూబ్ చాలా రిజర్వ్ గా ఉన్నాడని అతని టాలెంట్ ను చూపించుకోవాలని నాగార్జున అన్నాడు.
ఇక అభిజిత్ కోపం గురించి మాట్లాడిన నాగార్జున మోనాల్ ను అభిజిత్ గురించి ఏం తెలుసో చెప్పమన్నారు.దానికి మోనాల్ నేను చాలాసార్లు ట్రై చేశాను బట్ అతను సరిగ్గా మాట్లాడలేదని చెప్పింది.ఇక అభిజిత్ కు పెద్ద కుటుంబం ఉందని, మోనాల్ కు కూడా పెద్ద కుటుంబం అంటే ఇష్టమనే విషయాన్ని నాగార్జున రివిల్ చేశారు.ఇక అభిజిత్ కు ఉన్న యాంగర్ ప్రాబ్లం తనకి కూడా ఉందని హారిక చెప్పింది.
ఇక బిగ్ బాస్ హౌస్ లో దివి పీస్ ఫుల్ ప్లేస్ కావాలనుకుంటున్నట్లు చెప్పగా అది బిగ్ బాస్ హౌస్ లో దొరకడం కష్టమని నాగార్జున అన్నారు.
ఆతరువాత కట్టప్ప ఎవరో చెప్పాలని నోయల్ ఇతర ఇంటి సభ్యులతో కలిసి నాగార్జునను కోరారు. నాగార్జున రిక్వెస్ట్ మేర దేవి హెడ్ లైన్స్ చదివింది. రాజశేఖర్ కుళ్ళు జోకులు వినడానికి కొంత కష్టంగా ఉందని, మోనాల్ చెప్పింది నిజమని ఆ విషయంలో తనని తాను కరెక్ట్ చేసుకోవాలని నాగార్జున రాజశేఖర్ మాస్టర్ ను సూచించారు.
ఇక అవసరం లేని చోట లెక్చర్స్ ఇవ్వవద్దని సాయికిరణ్ కు నాగార్జున సూచించారు.అలాగే మోనాల్ ట్రాన్స్ లేట్ చేయమన్న సందర్భంలో నాన్ వెజ్ పదాన్ని నువ్వు ఎందుకు వాడావని కళ్యాణిని ప్రశ్నించారు.దానికి కల్యాణి కావాలని కాదు ఏదో తెలియక వాడాను సారీ అని అన్నది.ఇక మనుషులు మాట్లాడుతున్నప్పుడు వాళ్ల పైకి ఎక్కవద్దని కల్యాణికి నాగార్జున సూచించారు.
ఆతరువాత సొహైల్, అరియానాకు నాగార్జున టాస్క్ ఇచ్చారు దానిలో భాగంగా స్టోర్ రూమ్ కి వెళ్లి బోర్డ్స్ తీసుకొచ్చిన ఇద్దరూ
ఊసరవెల్లి (జోర్దర్ సుజాత)
కాకరకాయి (దివి)
రొమాంటిక్ (అఖిల్ )
చిచ్చు పెట్టడం (కరాటే కళ్యాణి)
డ్రామా క్వీన్ (హారిక)
బద్ధకం (సాయి కిరణ్)
చెత్తకుండి (అభిజిత్ )
లౌడ్ స్పీకర్ ( నోయెల్)
తోపు ( గంగవ్వ)
దేవి (పర్‌ఫెక్ట్)
క్రై బేబీ ( మోనాల్)
బకరా ( లాస్య )
మిర్చి ( మెహబూబ్)
జోకర్ ( అమ్మా రాజశేఖర్)
అని ఇంటి సభ్యులకు వేశారు.
ఆతరువాత ఈవారం ఎలిమినేషన్ నుండి సేవ్ అయిన తొలి ఇంటి సభ్యుడి గురించి తెలుసుకోవడం కోసం సొహైల్, అరియానా పోస్ట్ బాక్స్ నుండి లెటర్ తెచ్చారు.అందులో మొదట అభిజిత్ సేఫ్ అయ్యారు.
Advertisements
ఆతరువాత ఎలిమినేషన్ నుండి సుజాత సేవ్ అయ్యింది.ఇక ఇంటి సభ్యులను చాలా రోజుల నుండి ఇబ్బంది పెడుతున్న కట్టప్ప అనేవారు ఇంట్లో ఎవరూ లేరని ఇంట్లో మెజారిటీ సభ్యులు కట్టప్ప గా భావించిన లాస్యను బిగ్ బాస్ సీజన్ 4 లో మొదట క్యాప్టెన్ గా నాగార్జున ప్రకటించారు.ఇక ఈరోజు ఎపిసోడ్ ముగించే ముందు నాగార్జున ఈవారం చివరిగా గంగవ్వ ను సేవ్ చేసినట్లు చెప్పారు.