Advertisement
గురువారం నాటి ఎపిసోడ్‌లో గంగవ్వ వైద్యుల పర్యవేక్షణలోకి వెళ్ళింది.ఇక ఆరోగ్య పరంగా సమస్యలను ఎదుర్కొంటున్న గంగవ్వ ఇకపై బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగుతుందా? లేదా అనే అంశంపై క్లారిటీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన అవినాష్, కుమార్ సాయిలు రెండు టీంలుగా ఏర్పడి కామెడీ స్కిట్‌లు చేసే పనిలో బాగా బిజీ అయ్యారు.ఇక కుమార్ సాయి,దివి, దేవి, హారిక, రాజశేఖర్ మాస్టర్ లు కలిసి ‘గందరగోళం’ డ్రామా కంపెనీ అంటూ కామెడీ చేయగా.అవినాష్, కరాటే కళ్యాణి, సుజాత, అఖిల్, మొనాల్‌లు ‘బకరా’ అనే స్కిట్ చేసి కామెడీ పండించారు. ఈ తతంగానికి జడ్జ్ లుగా వ్యవహరించిన లాస్య నోయల్ ఈ టాస్క్ లో అవినాష్ ను విజేతగా ప్రకటించారు. బిగ్ బాస్ 3 నిమిషాల స్కిట్ చేయమనగా అవినాష్ టీం 5 నిమిషాలు పైన స్కిట్ చేశారని దీన్ని లాస్య,నోయల్ పరిగణలోకి తీసుకోలేదని రాజశేఖర్ మాస్టర్ అసహనం వ్యక్తం చేశారు.
ఇక మోనాల్,అభిజిత్‌లు ఇంటి సభ్యులు డాన్స్ చేస్తూ పాటలు పాడుకుంటూ ఉన్న పట్టించుకోకుండా వారిద్దరూ పక్కన కూర్చుని ముచ్చట్లు పెట్టారు.
ఆతరువాత కిచెన్‌లో తాను ఉంటానని దేవి మరోసారి లాస్యతో వాదనకు దిగింది.ఆ సమయంలో అందరూ నన్ను కావాలనే పక్కన పెడుతున్నారని బాధ పడింది దేవి.
Advertisement
ఇక ఇంటి నియమాలను ఎవరూ పాటించడం లేదని ఫైర్ అయిన బిగ్ బాస్.మోనాల్, అభిజిత్, అఖిల్, నోయల్, హారికలు తెలుగేతరా భాషల్లో మాట్లాడుతున్నారని అలాగే పిలిచినా వెంటనే రాకుండా నిధానంగా తీరిక చేసుకొని అమ్మా రాజశేఖర్, దేవి, మొనాల్, నోయల్, కళ్యాణి, దివిలు వస్తున్నారని వారికి శిక్షలు విధించారు. అందులో భాగంగా మొనాల్, అభిజిత్, అఖిల్, నోయల్, హారికలు బిగ్ బాస్ తదుపరి ఆదేశం వరకూ సుజాత దగ్గర తెలుగు నేర్చుకోవాలని.అలాగే సమయపాలన పాటించని వాళ్లు ఇంట్లో బెల్ మోగిన ప్రతిసారి గుంజీలు తీయాలని బిగ్ బాస్ ఆదేశించారు.
Advertisements
ఇక ఈ శనివారం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళిపోతా బిగ్ బాస్ నాకు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ బిగ్ బాస్‌ని తిట్టిన నోయల్ ఈవారం కెప్టెన్ అయ్యారు.
ఇక నోయల్ కెప్టెన్ అయిన వెంటనే కిచెన్ టీంలో యాంకర్ దేవి, మొనాల్, కళ్యాణి, లాస్యలను ఎంపిక చేశాడు. ఆతరువాత ఈ అంశంపై రాజశేఖర్ మాస్టర్-దేవిల మధ్య వాగ్వాదం జరిగింది.
Advertisements
ఇక ఈ చర్చ తరువాత కళ్యాణి మళ్లీ లైఫ్‌లో ఇలాంటివి జరుగుతుంటాయని.. గుణపాఠాలు నేర్చుకోవడానికే ఇక్కడకు వచ్చాం.. అని వేదాంతం పలికింది.ముక్కు అవినాష్.. మొనాల్‌ని ఇమిటేట్ చేసి కామెడీ చేయడంతో మోనాల్ అవినాష్‌పై ఫైర్ అయ్యింది. పదే పదే నా పేరు ఎందుకు తీస్తున్నావ్.. నాకు కోపం వస్తుంది.. ఒక్కసారి పిలిస్తే జోక్ అనుకోవచ్చు.. మళ్లీ మళ్లీ ఇలా చేస్తే బాగోదు అంటూ వార్నింగ్ ఇచ్చింది.దీంతో అవినాష్ నేను సరదాగా అన్నానని..మోనాల్ కు క్షమాపణ చెప్పడంతో నేటి ఎపిసోడ్ ముగిసింది.