Advertisement
శనివారం రాత్రి అదిరిపోయే డ్యాన్స్ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగ్.బిగ్ బాస్ సీజన్ 4ను రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ముగ్గురులో ఇద్దరు చూస్తున్నారని.. బిగ్ బాస్ హిస్టరీలోనే అత్యధిక రేటింగ్ సీజన్ 4కి వచ్చిందనే విషయాన్ని నాగార్జున ప్రేక్షకులతో పంచుకున్నారు.ఆతరువాత రెండవ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఉన్న తొమ్మిది మందిలో ఇద్దరినీ ఈవారం ఇంటి నుండి బయటకు పంపబోతున్నట్లు తెలిపారు.ఈవారం ఆరు కోట్ల ఓటింగ్ జరిగిందనే విషయాన్ని స్వయంగా నాగార్జునే రివీల్ చేశారు.
ఇక ఆతరువాత మన టీవీ ద్వారా ప్రేక్షకులను నాగార్జున ఇంట్లోకి తీసుకెళ్లారు.ఇక అనారోగ్యంతో బాధపడుతున్న గంగవ్వ శనివారం ఎపిసోడ్ లో ఫుల్ ఫాంలోకి వచ్చేసింది.తరువాత ఇంటి సభ్యులు ఒప్పో ఫొటో కాంటెస్ట్‌లో భాగంగా నాలుగు టీమ్స్ గా విడిపోయి ఫోటోలకు ఫోజులు ఇవ్వాలని బిగ్ బాస్ ఆదేశించారు.
అందులో భాగంగా రాజశేఖర్ మాస్టర్,దివి-మొహబూబ్‌లను స్విమ్మింగ్ పూల్‌లోకి దింపి ఫొటోలు తీశారు.ఇక మొనాల్-అభికి కిస్ ఇస్తూ ఫొటోకు పోజు ఇచ్చింది.
తరువాత కన్ఫెషన్ రూంకి వెళ్ళిన గంగవ్వ నాగార్జునతో మాట్లాడి అందరినీ నవ్వించారు.ఇక గంగవ్వతో నాగార్జున నువ్వు నన్ను అన్నా అన్నావు. చెల్లెల్ని బాగా చూసుకునే బాధ్యత నాది అని అన్నారు.
ఆతరువాత నామినేషన్‌లో ఉన్న తొమ్మిదిమంది కంటెస్టెంట్ల పై మేం మంచివాళ్లం.. సింపథీ పొందుదాం అని ప్రయత్నిస్తున్నారా అంటూ నాగార్జున ఫైర్ అయ్యారు. అయితే నాగార్జున మాట్లాడుతున్న సమయంలో కుమార్ సాయి నవ్వుతుండడం చూసిన నాగ్ నువ్వు ఎందుకయ్యా నవ్వుతున్నావు. బిగ్ బాస్ అంటే జోక్‌గా ఉందా? ఇది జోక్‌లు వేసుకునే మ్యాటర్ కాదు.. నువ్వు లోపలికి వెళ్లి జోక్‌లు కూడా వేయడం లేదు.. అంటూ సీరియస్ అయ్యారు.
Advertisements
ఆతరువాత నామినేషన్స్ కోసం టాస్క్ ఇస్తే.. త్యాగాలు చేస్తారా? నోయల్.. గంగవ్వ సంగతి నీకెందుకయ్యా.. ఆమె ఆట ఆమె ఆడతారు అంటూ నోయల్‌కి క్లాస్‌కి పీకారు. అలాగే గంగవ్వను నువ్వు ఎవరి మాట వినొద్దు.. అని నాగార్జున సలహా ఇచ్చారు.ఇక ఈవారం మొదటిగా ఎలిమినేషన్ నుంచి గంగవ్వ సేఫ్ అయ్యారనే విషయాన్ని నాగార్జున తెలిపారు.
Advertisement
అలాగే నామినేషన్స్ అంటే చాలా సీరియస్ అని స్వయంగా బిగ్ బాస్ చెప్పినా కూడా దానిపై హాస్యం చేస్తారా అంటూ నాగార్జున ఇంటి సభ్యుల పై మండిపడ్డారు.మీరు సేఫ్ గేమ్ ఆడాలని చూస్తున్నారు అది జరగనివ్వను.. అని హీరో-జీరో టాస్క్ ఇచ్చారు.ఇందులో ఇంటి సభ్యులు హీరో అని భావించిన వాళ్లను కుర్చీలో కూర్చోబెట్టాలని.. అలాగే జీరో అని భావించిన వాళ్లను మెడపట్టుకుని బయటకు నెట్టాలని నిబంధనను పెట్టారు నాగార్జున.
✦ మొదటగా వచ్చిన నోయల్ : రాజశేఖర్ మాస్టర్‌ని హీరో అని కుమార్ సాయిని జీరో అని జీరో ద్వారంలోకి తోశాడు.
✦ ఇక తర్వాత వచ్చిన సుజాత.. కళ్యాణిని జీరో ద్వారం నుంచి బయటకు తోయగా హీరోగా అమ్మా రాజశేఖర్‌ని ఎంచుకుంది.
✦ సొహైల్.. నోయల్‌ని హీరోగా, కళ్యాణిని జీరోగా ఎంచుకున్నాడు.
*ఇక దేవి అరియానా గ్లోరీని హీరోగా, అమ్మా రాజశేఖర్ పెద్ద జీరో అని ఎంచుకున్నది.
✦ఇక మొహబూబ్.. హీరోగా లాస్యను కుమార్ సాయిని జీరోగా ఎంచుకున్నాడు.
✦ఇక తర్వత వచ్చిన కుమార్ సాయి సింగర్ నోయల్‌ని జీరోగా అభిజిత్‌ను హీరోగా ఎంచుకున్నాడు
✦ఆతరువాత వచ్చిన దేత్తడి హారిక.. అభిజిత్‌ని హీరోగా, కుమార్ సాయిని జీరోగా ఎంచుకుంది.
✦లాస్య.. గంగవ్వను హీరోగా అమ్మా రాజశేఖర్‌ని జీరోను ఎంచుకుంది
✦ ఇక కళ్యాణి యాంకర్ సుజాతని జీరోగా గంగవ్వను హీరోగా ఎంచుకుంది.
✦ అఖిల్ గంగవ్వను హీరోగా, కుమార్ సాయిని జీరోగా ఎంచుకున్నాడు.
✦ అరియానా గ్లోరీ గంగవ్వను హీరోగా, కరాటే కళ్యాణిని జీరోగా చేసింది.
✦ రెండో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిన అవినాష్ రాజశేఖర్ మాస్టర్ ను హీరో అని కుమార్ సాయి జీరో అని చెప్పాడు.
✦ దివి హీరో అంటే అమ్మా రాజశేఖర్ అని, కుమార్ సాయిని జీరో అని చెప్పింది.
Advertisements
ఇక రెండో వారం నామినేషన్‌లో ఉన్న తొమ్మిది మందిలో మొదట గంగవ్వ సేఫ్ కాగా. డబుల్ ఎలిమినేషన్ లో మొదటిగా కరాటే కళ్యాణి ఎలిమినేట్ అయ్యారు.ఇక మిగిలిన వారిలో ఎవరు సేఫ్ అవుతారనే విషయం ఆదివారం ఎపిసోడ్ లో తేలనున్నది.