Advertisement
మనకి టైటానిక్ అనగానే జేమ్స్ కెమెరూన్ తీసిన సినిమానే గుర్తొస్తుంది.! కానీ కెమరూన్ టైటానిక్ సినిమా కంటే ముందే….టైటానిక్ పడవ ప్రమాదం జరిగిన 29 రోజులకు ఓ సినిమా విడుదలైంది. కాకపోతే ఇదో మూకీ చిత్రం, ఈ చిత్ర నిడివి 10 నిమిషాలు….మరో విశేషమేంటంటే…..అదే టైటానిక్ లో ప్రయాణించి ప్రాణాలతో బయటపడిని సినీ నటి తీసిన చిత్రమిది!
సౌతాంప్టన్ నుండి న్యూయార్క్ కి బయలుదేరిన టైటానిక్ ఓడ 1912 ఏప్రిల్ 17 న అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ సమయానికి అందులో 2224 మంది ప్రయాణికులున్నారు… వారిలో 1500 మందికి పైగా మరణించారు . ప్రమాదం జరిగినప్పుడు టైటానిక్ ఓడ నుండి పంపించిన తొలి రెస్క్యూ లో 28 మంది ప్రాణాలతో బయటపడ్డారు.
Advertisement
అలా బయటపడిని 28 మందిలో ఒకరు…..అమెరికాకు చెందిన డోరోతి గిప్సన్ అనే నటి! ప్రమాదం నుండి బయటపడగానే…. ఆ విషాదానికి సంబంధించిన తన జ్ఞాపకాలతో ఆమె వెంటనే ఒక స్క్రిప్ట్ రాసారు …..టైటానిక్ ను, ఐస్ బర్గ్ లను క్రియేట్ చేసి న్యూ జర్సీ స్టూడియోలో షూటింగ్ జరిపారు. పది నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ని 1912 మే 14 న అంతర్జాతీయంగా విడుదల చేస్తే ప్రేక్షకులు విపరీతంగా చూసారు .
Advertisements
ఆ సినిమా పేరు “సేవ్డ్ ఫ్రమ్ థి టైటానిక్ ” ఇదొక మూకీ సినిమా . అయితే ఈ సినిమా కాపీ 1914 మార్చిలో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో తగలబడిపోవడం మరో విషాదం . అంటే జల సమాధికి సంబంధించిన సినిమా అగ్గికి ఆహుతైందన్నమాట .
Advertisements