Advertisement
ఇప్పుడంటే మనం ప్లాస్టిక్ ప్లేట్లు, పాత్రలను ఉపయోగిస్తున్నాం.. కానీ పూర్వం మన పెద్దలు ఆహారం తినేందుకు అరటి ఆకులనే ఎక్కువగా ఉపయోగించేవారు. అవి ఎక్కడ పడితే అక్కడ లభిస్తాయి. పైగా ఒకసారి తిని పారేయవచ్చు. వాటిని వ్యర్థాలు మురగబెడితే కంపోస్టు ఎరువు కూడా తయారవుతుంది. ఇలా అరటి ఆకులను ఉపయోగించేవారు. అయితే వారు అప్పట్లో అరటి ఆకులపై తిన్నా.. నిజానికి ఇందులో సైన్స్ కూడా ఉంది. సైన్స్ పరంగా మనకు లాభాలు కూడా ఉన్నాయి. అవేమిటంటే…
అరటి ఆకుల్లో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల వాటిల్లో ఆహారం తింటే ఆ పొటాషియం మన శరీరంలోకి చేరుతుంది. ఇది గుండె సమస్యలను రాకుండా చూస్తుంది. ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారికి స్ట్రోక్స్ రాకుండా చేస్తుంది. హైబీపీని తగ్గించడంలో పొటాషియం ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకనే అరటి ఆకుల్లో తింటే ఈ ప్రయోజనాలు కలుగుతాయి.
ఇక అరటి ఆకుల్లో పాలీఫినాల్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తాయి. క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అందువల్ల అరటి ఆకులలో తినడం అలవాటు చేసుకోవాలి.
Advertisements
Advertisement
అరటి ఆకులు సహజమైనవి. వాటిని శుభ్రం చేసి తినడం వల్ల ఎలాంటి వ్యాధులు రావు. అదే ప్లాస్టిక్ అయితే ఆ ప్లేట్లపై మనం ఉంచే ఆహారంలోకి ప్లాస్టిక్‌లో ఉండే రసాయనాలు వెళ్లి కలుస్తాయి. అందువల్ల దాంతో వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల అరటి ఆకులు అయితే తినేందుకు ఉత్తమం. దీంతో వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు.
సాధారణంగా ఇతర ఏ ప్లేట్లలో వడ్డించిన ఆహారం అయినా సరే.. దానికన్నా అరటి ఆకుల్లో వడ్డించిన ఆహారమే రుచిగా ఉంటుంది.
Advertisements
అందువల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కనుకనే మనం అరటి ఆకుల్లో ఆహారాన్ని తినాలి. అయితే కేవలం భారతీయులు మాత్రమే కాదు.. ఫిలిప్పీన్స్, లాటిన్ అమెరికా, ఉగాండా తదితర దేశాలకు చెందిన వారు కూడా ఆహారాన్ని అరటి ఆకుల్లోనే తింటారు. కొందరు అరటి ఆకుల్లో ఫుడ్‌ను ప్యాక్ చేసి తింటారు. అయితే అరటి ఆకులను నేరుగా ప్యాకింగ్‌కు ఉపయోగిస్తే సులభంగా చిట్లిపోతాయి. కనుక వాటిని వేడిపై ఉంచి రోస్ట్‌లా చేయాలి. దీంతో వాటిలో ఫుడ్‌ను ప్యాక్ చేసినా సులభంగా చిట్లిపోకుండా ఉంటాయి. ఈ క్రమంలో ఫుడ్‌ను చాలా సేపు వాటిలో ఉంచవచ్చు. మన పూర్వీకులు అప్పట్లో వీటిల్లో తిన్నారు కనుకనే అంత ఆరోగ్యంగా ఉన్నారు. అరటి ఆకులు ప్రకృతి సహజసిద్ధమైనవి కావడంతోనే మనకు ఇన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి.