Advertisement
ప్రపంచం మొత్తం మీద ఉన్న ప్రమాదకర జీవుల్లో దోమలు కూడా ఒకటి. ఇవి మనకు అనేక రకాల వ్యాధులను కలగజేస్తాయి. మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా, ఎల్లో ఫీవర్, జికా వైరస్, ఎన్‌సెఫలైటిస్ తదితర అనేక వ్యాధులు మనకు దోమలు కుట్టడం వల్ల వస్తాయి. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు దోమల నివారణకు చర్యలు తీసుకుంటూనే ఉంటాయి. కానీ ఏటా అవి మనల్ని ఇబ్బందులు పెట్టడం మాత్రం మానడం లేదు. వీటి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే వస్తోంది. అయితే చిన్న దోమ కుట్టినా మనకు నొప్పి, మంట, దురద కలుగుతాయి.అలాంటి నిత్యం వేల సంఖ్యలో దోమలతో ఆయన కుట్టించుకుంటూ సాహసం చేస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.
పెర్రాన్ రోస్ అనే ఓ ఎంటమాలజిస్టు దోమల వల్ల కలిగే వ్యాధులను నివారించేందుకుగాను కొత్త తరహా ఔషధాలను కనిపెట్టడం మొదలు పెట్టాడు. అందుకు గాను దోమల గుడ్లలో వొల్‌బాకియా అనే ఓ తరహా బాక్టీరియాను ప్రవేశపెట్టి పరీక్షలు చేస్తున్నారు. అయితే దోమల గుడ్లు సహజంగానే మన కళ్లకు కనిపించనంత చిన్నగా ఉంటాయి. అందువల్ల వాటిల్లోకి బాక్టీరియాను ఇంజెక్ట్ చేయాలంటే అందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన పరికరాలు కావాలి. ఇక ఆ గుడ్ల గోడలు చాలా పలుచగా ఉంటాయి కనుక బాక్టీరియాను వాటిలోకి ప్రవేశపెట్టే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే అవి పగిలిపోతాయి. ఈ క్రమంలో పెద్ద ఎత్తున దోమ గుడ్లలోకి నిత్యం ఆ బాక్టీరియాను ప్రవేశపెడుతున్నారు.
Advertisement
Our study on inbreeding and laboratory adaptation in mosquitoes is out now! https://t.co/AnE8KU5aJR pic.twitter.com/ckUadL6ChD
— Perran Ross (@MosWhisperer) November 28, 2018
Advertisements
అయితే ఆ ప్రక్రియకు గాను రోస్‌కు పెద్ద ఎత్తున దోమ గుడ్లు అవసరం అవుతున్నాయి. అందుకుగాను అవి ఎక్కువ మొత్తంలో రక్తం తాగి గుడ్లను పెట్టాల్సి ఉంటుంది. కనుక వాటికి అతను తన చేతుల్తో రక్తాన్ని ఇస్తున్నాడు. తన చేతిని వాటి వద్ద పెట్టగానే అవి ఆ చేతి మీద వాలి రక్తాన్ని పీలుస్తాయి. ఒక్కో బ్యాచ్‌కు 250 ఆడ దోమలకు అతను తన రక్తాన్ని పీల్చుకునే అవకాశం ఇస్తున్నాడు. ఈ క్రమంలో నిత్యం 5వేల వరకు దోమలకు అతను తన రక్తాన్ని ఇస్తున్నాడు. ఆ రక్తాన్ని తాగే దోమలు గుడ్లు పెడుతున్నాయి. వాటిలోకి ఆ బాక్టీరియాను ప్రవేశపెట్టి ఔషధాల తయారీకి యత్నిస్తున్నారు. అయితే అన్ని వేల దోమలను నిత్యం అతను కుట్టించుకుండడంతో అతని చేయి ఎప్పుడూ దద్దుర్లతో ఎర్రగా కనిపిస్తుంది. కానీ అసలు మనకు ఒక్క దోమ కుడితేనే అనారోగ్యం కలుగుతుంది. అలాంటిది అన్ని వేల దోమలతో నిత్యం కుట్టించుకుంటున్నా రోస్‌కు ఏమీ కాకపోవడం నిజంగా విశేషమే మరి.
Record day of mosquito blood feeding today. ~5000 female mosquitoes fed and 16 mL of blood lost. pic.twitter.com/7OzeQ9rGl7
— Perran Ross (@MosWhisperer) May 7, 2020
Advertisements