Advertisement
ఈ సిక్వెల్ ఫార్ములా మొదట్లో బాలీవుడ్ లో బాగా వినిపించేది . ఒక సినిమా హిట్ అయిందంటే చాలు డైరెక్టర్స్ వెంటనే దాని సిక్వెల్ కి కథ రెడీ చేసుకునే వారు ఆడియన్స్ కూడా వాటి కోసం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసేవారు! కొన్ని రోజులకు ఆ సాంప్రదాయం కాస్త మన టాలీవుడ్ లో కూడా మొదలైంది. కానీ మన దర్శకులు ఈ ఫార్ములాతో అంతగా సక్సెస్ అవ్వలేకపోయారు . ఇలా ఇప్పటివరకు మన టాలీవుడ్ లో సిక్వెల్ చేసి పరాజయం పొందిన సినిమాలు ఏంటో చూద్దాం .
1. శంకర్ దాదా MBBS
మెగాస్టార్ చిరంజీవి 2004 లో తీసిన సూపర్ హిట్ ఏమోషనల్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ శంకర్ దాదా MBBS సినిమా మంచి విజయం సాధించింది . దానికి సిక్వెల్ గా 2007 లో తీసిన శంకర్ దాదా జిందాబాద్ సినిమా నిరాశ పరిచింది! శంకర్ దాదా MBBS 10 కోట్లు పెట్టి తీస్తే దాదాపు 51 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది!
2. ఆర్య
Advertisements
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా 2004 లో తీసిన ఆర్య సినిమా బ్లాక్ బస్టర్ .. కానీ దానికి సిక్వెల్ గా 2009 లో వచ్చిన ఆర్య 2 మాత్రం అట్టర్ ప్లాఫ్ . ఆర్య 4 కోట్లతో తీస్తే దాదాపు 30 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.!
3. కిక్
రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 2009 లో వచ్చిన కిక్ సినిమా సూపర్ డూపర్ హిట్ . కానీ అదే సినిమాకి సిక్వెల్ గా 2015 లో తీసిన కిక్2 మాత్రం ఫ్లాప్ గా నిలిచింది.
Advertisement
4. గబ్బర్ సింగ్
హరీష్ శంకర్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ హీరోగా 2012 లో చేసిన గబ్బర్ సింగ్ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవగా…. …అదే సినిమాకి సిక్వెల్ గా 2016 లో బాబీ డైరెక్ట్ చేసిన సర్థార్ గబ్బర్ సింగ్ మాత్రం ఫ్లాప్ గా నిలిచింది.
5. గాయం
1993 లో జగపతిబాబు హీరోగా చేసి విజయం సాధించిన గాయం సినిమాని మళ్ళీ 2010 లో సిక్వెల్ గా తీస్తే ఇది కూడా ప్లాప్ గా నిలిచింది.
6. మంత్ర
2007 లో ఛార్మి ముఖ్య పాత్రలో నటించిన హర్రర్ సస్పెన్స్ సినిమా మంత్ర.! హిట్ .., ఇదే పేరుతో 2015 లో తీసిన సీక్వెల్ మంత్ర 2 ప్లాప్!
7. మన్మథుడు
నాగార్జున హీరోగా 2002 లో వచ్చిన మన్మథుడు మంచి విజయాన్ని సాధించింది., కానీ దానికి సిక్వెల్ గా 2019లో తీసిన మన్మథుడు 2 ప్లాప్ గా నిలిచింది .
Advertisements
ఏది ఏమైనా బాలీవుడ్ సిక్వెల్ ఫార్ములా మన టాలీవుడ్ డైరెక్టర్స్ కి అంతలా కలిసిరాలేదనే చెప్పాలి. ఇదే ఫార్ములాతో తీసి మన టాలీవుడ్ లో సక్సెస్ కొట్టిన డైరెక్టర్స్ కూడా ఉన్మారు .