Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

సినిమాల‌కు టికెట్ ద్వారా డ‌బ్బులొస్తే…… సీరియ‌ల్స్ కు డ‌బ్బులెలా వ‌స్తాయి?

Advertisement

సినిమాల‌కు టికెట్ ద్వారా డ‌బ్బులొస్తాయి మ‌రి సీరియ‌ల్స్ కు డ‌బ్బులెలా వ‌స్తాయి? కాస్త తెలివిగా ప్లాన్ చేసుకుంటే సినిమాల‌కంటే సీరియ‌ల్స్ ద్వారానే ఎక్కువ డ‌బ్బు సంపాధించొచ్చు! సీరియ‌ల్స్ కు ఇన్ క‌మ్ ఎలా వ‌స్తుందో చూద్దాం.

30 నిమిషాలు సీరియ‌ల్ స్లాట్ అనుకుంటే….అందులో సీరియ‌ల్ ప్లే అయ్యేది 20 నిమిషాలు…మ‌రో 10 నిమిషాలు యాడ్స్ ప్లే అవుతాయి. మేజ‌ర్ రెవెన్యూ వ‌చ్చేది ఈ యాడ్స్ మీద‌నే….. హై TRP ఉన్న సీరియ‌ల్స్ కు ఆ 10 నిమిషాల గ్యాప్ లో వ‌చ్చే యాడ్స్ పై ఎపిసోడ్ కు 5 ల‌క్షలొస్తే….అందులో 3 లక్షలు ఛానెల్ కి మరియు 2 లక్షలు సీరియల్ ప్రొడ్యూసర్ కి వెళ్తాయి . వారంలో 5 ఎపిసోడ్స్ లా లెక్క వేసుకున్నా….ప్రొడ్యూస‌‌ర్ కు వ‌చ్చే మొత్తం…. 5× 200000 = 10,00000.

Advertisement

ఇందులో న‌టీన‌టుల‌కు ఇవ్వాల్సిన మొత్తం ప్రొడ్యూస‌రే చెల్లించాల్సి ఉంటుంది. ఆ ఖ‌ర్చులు మొత్తం తీసేసినా హిట్ సీరియ‌ల్ పై ప్రొడ్యూస‌ర్ కు వారానికి 4-5 ల‌క్ష‌ల రెవెన్యూ వ‌స్తుంది.

Advertisements

ఇవికాకుండా…. సీరియ‌ల్స్ లోనే సంద‌ర్భానుసారం జ్యుయెల‌రీ, శారీస్, కొన్నికంపెనీలను ప్ర‌మోట్ చేస్తుంటారు ఆ రెవెన్యూ కూడా ప్రొడ్యూస‌ర్ కే వ‌స్తుంది. దానికి తోడు టివీల్లో ప్లే అయిన సీరియ‌ల్ వీడియోస్ ను యూట్యూబ్ లో పెట్టిన‌ప్పుడు అక్క‌డ నుండి వ‌చ్చే రెవెన్యూలో కూడా టివీ యాజ‌మాన్యానికి, ప్రొడ్యూస‌ర్ కి షేర్ ఉంటుంది.

Advertisements