Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

సీత‌క్క స‌రే ! .., మ‌రి ప‌క్క‌నున్న ఈ అక్క గురించి మీకు తెలుసా?

Advertisement

లాక్ డౌన్ వేళ‌… అడ‌వి బిడ్డ‌ల ఆక‌లి తీరుస్తూ క‌నిపించిన సీత‌క్క సేవా గుణానికి జ‌నాలు జేజేలు ప‌లికారు. అదే స‌మ‌యంలో ఆమె ప‌క్క‌న న‌డుస్తూ అడ‌వి బిడ్డ‌ల‌కై అలుపెరుగ‌ని సాహాసం చేసిన మ‌రో అక్క‌ను కూడా మీరు గ‌మ‌నించే ఉంటారు.! ఆమె పేరు తస్లీమా మహమ్మద్.., ములుగు స‌బ్ రిజిస్ట్రార్.

 

త‌స్లీమా త‌న రెండ‌వ యేట‌నే తండ్రిని కోల్పోయింది. వ్య‌వ‌సాయం చేస్తూ త‌ల్లి త‌న అయిదుగురు పిల్ల‌ల‌ను సాకింది. అందులో నాలుగ‌వ సంతాన‌మే త‌స్లీమా.! నాలుగ‌వ యేట‌నే హాస్ట‌ల్ లో చేరిన త‌స్లీమా… ప్ర‌భుత్వ ఉద్యోగ‌మే ధ్యేయంగా త‌న చ‌దువును కొన‌సాగించింది. కాక‌తీయ యూనివ‌ర్సిటీ లైబ్ర‌రీలో ఉద‌యం 8 నుండి రాత్రి 8 వ‌ర‌కు అలా రోజంతా చ‌దువుతూనే గ‌డిపింది. ఆమె క‌ష్టం, త‌ల్లి ఆకాంక్ష ఏవీ వృథా కాలేదు…త‌స్లీమాకు గ్రూప్స్ లో మంచి ర్యాంక్ వ‌చ్చింది.

నిలువెల్లా సేవా గుణం:

  • లాక్ డౌన్ లో అడ‌వి బిడ్డ‌ల ఆక‌లి తీర్చ‌డ‌మే కాక‌…. కరోనా బారిన పడకుండా త‌న‌దైన శైలిలో వారికి జాగ్రత్తలు చెప్పారు.
  • ఛత్తీస్ గడ్ బయలుదేరిన వలసకూలీలు దారితప్పి ములుగు చేరుకుంటే వారికి అన్నం వడ్డించి పెట్టి వారిని స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు చేశారు.

Advertisements

Advertisement

  • ఐదుగురు పిల్లలున్న ఒక రాజస్తానీ చనిపోతే ఆ కుటుంబాన్ని దత్తతకు తీసుకొని అన్నీ తానై వారికి తగిన కార్డులు, ఒక ప్లాట్ ఇప్పించారు. వారి పండుగల్ని వారితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు.
  • త‌న తండ్రి పేరు మీద చారిట‌బుల్ ట్ర‌స్ట్ పెట్టి ఎన్నో సేవాకార్య‌క్ర‌మాలు చేస్తున్నారు.

ప్రతి ఫోటో వెనక ఒక జ్ఞాపకం ఉంటుంది అలాంటిదే ఈ జ్ఞాపకం…..

Advertisements

“నా ఉద్యోగ వృత్తి పరిధిలో ఉండే పేనుగొలు గ్రామం అడవిలో కనీసం 20 కిలోమీటర్లు లోపల ఉంటుంది ఆ 20 కిలోమీటర్లు రోడ్డు మార్గం ఉండదు 5 గుట్టలు, వాగులు దాటుకుంటూ పోవాలి, అక్కడ పేద ప్రజల బాగోగులు తెలుసుకుంటానికి వెళ్లాలని ట్రస్ట్ ద్వారా వారికి ఏదో ఒకటి చేయాలని అనుకున్నాను, పరిస్థితుల ప్రభావం వల్ల వెళ్ళలేకపోయాను కానీ సీతక్క చేస్తున్న సేవలు చూసి అక్క విసిరిన గో హంగర్ గో చాలెంజ్ స్వీకరించి అక్కడికి వెళ్దామని వెళ్లాలని నిర్ణయించుకున్నాను అక్క తో పాటు వెళ్లాను( సీతక్క ఫౌండేషన్,సర్వర్ చారిటబుల్ ట్రస్ట్ అమ్మ ఫౌండేషన్ల ) ఆధ్వర్యంలో నా చాలెంజ్ పూర్తి చేశాను కూడా, దానికి గుర్తుగానే తిరుగు ప్రయాణంలో ఈ ఫోటో దిగడం జరిగింది, ఈ ఫోటో ఎప్పుడు చూసినా ధీరవనిత లాగా సాధించిన మా విజయమే గుర్తొస్తుంది…. #womenpower
It is my best picture in life.”   – తస్లీమా మహమ్మద్.   (సబ్ రిజిస్టార్ ములుగు)