Advertisement
కరోనాని సమర్దవంతంగా ఎదుర్కొని దేశానికే ఆదర్శంగా నిలిచిన కేరళ రాష్ట్ర కృషిని ఐక్యరాజ్యసమితి గుర్తించింది.. ప్రజాసేవా దినోత్సవం సంధర్బంగా ఆ రాష్ట్ర ఆరోగ్యమంత్రి కెకె శైలజను ప్రధాన వక్తగా ఆహ్వానించింది.. కేరళ వైరస్ ని ఎలా ఎదుర్కొంది.. అందులో శైలజా టీచర్ పాత్రేంటి?
కెకె శైలజా వృత్తిరిత్యా టీచర్.. తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి మంత్రి అయ్యాక కూడా శైలజా టీచర్ గా ప్రసిద్ది పొందారు.. డిసెంబర్ లోనే చైనాలో వైరస్ ప్రభలినప్పటికి ప్రపంచం మొత్తం నిర్లక్ష్యం వహించింది.కానీ వైరస్ గురించి వార్తలు వినగానే , శైలజా దానిపై స్టడీ చేశారు….ఏ సంధర్బంలో అయినా ఇక్కడ కూడా ప్రభలొచ్చు అని ముందుగానే ఊహించారు..ఊహించినట్టుగానే తొలికేసు బయటపడింది కేరళలోనే…కేరళలో బయటపడింది అనేకంటే కేరళ ముందు అప్రమత్తం అయింది అంటే బాగుంటుంది..
- కేరళలో తొలికేసు బయటపడకముందే అందరితో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు శైలజా.. వెంటనే కంట్రోల్ రూం ఏర్పాటు చేయించి..14జిల్లాలలకు అక్కడి నుండే ఆదేశాలిచ్చేవారు..
- మాతృభాషలో కరోనా వైరస్ గురించి పాంప్లెంట్స్ వేయించి వాటిని రాష్ట్రం అంతా పంచిపెట్టించారు..స్కూల్స్ , అంగన్ వాడి కేంద్రాలు మూసి వేయించారు.. రేషన్ ఇళ్లకే పంపేలా చర్యలు తీసుకున్నారు..
- జిల్లా కలెక్టర్లు,వైద్య సిబ్బందితో చర్చించి పక్కా ప్లాన్ తో రంగంలోకి దిగారు
Advertisement
ట్రేస్,టెస్ట్,ఐసొలేట్ మరియు సపోర్ట్..
Advertisements
ఈ నాలుగు అంశాలతో ముందుకు వెళ్లారు..విదేశాలనుండి వచ్చినవారిని ట్రేస్ చేయడం..వారిలో మైల్డ్ లక్షణాలు కనిపించినప్పటికి టెస్ట్ చేయించడం.. పద్నాలుగు రోజులు తప్పనిసరిగా ఐసోలేషన్ ఉంచడం… ఈ మొత్తం ప్రాసెస్ కి ప్రజలు సపోర్ట్ చేసేలా చూడడంలో సఫలమయ్యారు.. పద్నాలుగు రోజులు హోం క్వారంటైన్ అవ్వడానికి ఇళ్లల్లో ఫెసిలిటిస్ ఉన్నవారిని ఇంటికి పంపించగా.. ఆ సౌకర్యం లేని వారిని ప్రభుత్వమే తమ స్వంత ఖర్చులతో వివిధ గృహాల్లో 14డేస్ ఐసోలేషన్లో ఉంచింది..
కేవలం కరోనా సంధర్బంలోనే కాదు..అంతకుముందు కేరళను అతలాకుతలం చేసిన నిఫా వైరస్, వరదలప్పుడు కూడ శైలజా టీచర్ ప్రధాన పాత్ర పోషించారు..నిఫా వైరస్ సమయంలో కేరళ తీసుకున్న చర్యల్ని వైరస్ అనే చిత్రంలో.. కళ్లకు కట్టినట్టు చూపించారు .అందులో నటించిన ప్రతిపాత్ర నిజజీవింతో ఉన్న పాత్రలే..ఈ వైరస్లను ఎదుర్కోవడానికి ప్రణాలిక రచించిన రూపకర్త శైలజా అయినప్పటికి సమిష్టి కృషివలనే ఇది సాధ్యం అయింది అంటారు ఆమె..
అది తన గొప్పతనమే అని ఆమె ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ రాష్ట్రం మొత్తం శైలజా ది సెయిలర్…శైలజా ది రాక్ స్టార్ అంటూ కొనియాడుతూంది..ఆఖరికి ఐరాస కూడా గుర్తించింది..
Advertisements