Advertisement
ఈ ఫోటోలో కనిపిస్తున్నామె పేరు షమీమ బేగం…తన 15 ఏళ్ల వయస్సులో …. ISIS కార్యకలాపాల వైపు ఆసక్తురాలై…ఇంగ్లాడ్ లోని స్కూల్ నుండి పారిపోయి సిరియా వెళ్లి ఇసిస్ లో జాయిన్ అయ్యింది.! అక్కడే ఓ తీవ్రవాదిని పెళ్లి చేసుకొని ముగ్గురు కొడుకులకు జన్మనిచ్చింది. యుద్దంలో తన భర్తను ఇద్దరు కుమారులను కోల్పోయి… సిరియాలోని అల్ రోజ్ శిబిరంలో ఉంటోంది. అక్కడ అధికారులు తనను వేధిస్తున్నారని, తన ఆరోగ్యం కూడా బాలేదంటూ .. పేర్కొంటూ తనకు మళ్లీ తన సొంత దేశమైన ఇంగ్లాడ్ పౌరసత్వం ఇవ్వాలని కోర్ట్ ను ఆశ్రయించింది.!
ఈమె పిటీషన్ పై ఇంగ్లాడ్ లో భిన్న వాదనలు వినపించాయ్… చిన్న వయస్సులో తను చేసేది తప్పు అని తెలియక ఈ పని చేసిందని, దానిని మన్నించి ఇంగ్లాడ్ పౌరసత్వం ఇవ్వాలని కొంత మంది ఆమెకు సపోర్ట్ చేశారు. ఆమె ఇంగ్లాడ్ నుండి పారిపోయినప్పుడు ఆమె వయస్సు 15 అంటే మైనర్ కాబట్టి సడలింపులివ్వాలని కొందరి వాదన!
Advertisement
ఒకవేళ ఇప్పుడు ఆమెకు ఇంగ్లాడ్ రావడానికి పర్మీషన్ ఇస్తే…మళ్లీ ఇక్కడి నుండి కొంత మందిని ఇసిస్ వైపుగా ప్రోత్సాహిస్తుందని…అశాంతికి కారణమౌతుందని.. ఆమె చేసింది దేశ ద్రోహమని…పర్మీషన్ ఇవ్వొద్దనేది కొందరి వాదన!
Advertisements
Advertisements
కింది కోర్టులలో ఆమె పిటీషన్ ను కొట్టివేసినప్పటికీ …. లండన్ లోని కోర్ట్ ఆఫ్ అప్పీల్ మాత్రం ఆమె పిటిషన్ పై సానుకూలంగా స్పందించి….తన ఇంగ్లాడ్ పౌరసత్వాన్ని తిరిగి ఇవ్వాల్సింది ప్రభుత్వాన్ని ఆదేశించింది…..మైనర్ గా ఉన్నప్పుడు తెలియక చేసిన తప్పుగా ఆమె తప్పును మన్నించింది.! హ్యుమానిటీ గ్రౌండ్స్ పై ఆమె కేసును పరిశీలించినట్టు తెలిపింది