Advertisement
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని ఇండస్ట్రీ హిట్ లుగా నిలిచాయి. మరికొన్ని కలెక్షన్ల సునామీలను సృష్టించాయి. కానీ కొన్ని చిత్రాలు మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్రని వేశాయి. అందులో ఒకటి 1979 లో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘శంకరాభరణం’. సంగీత ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రం ఎవరు ఉహించనంత సంచలన విజయాన్ని అందుకుంది.
సినిమా కథ:
శంకరశాస్త్రి ఒక గొప్ప సంగీత విద్వాంసుడు. వేశ్య కూతురైన తులసి ఆయన దగ్గర సంగీతం నేర్చుకోవాలని ఆశపడుతుంది. కానీ ఆమె తల్లి మాత్రం ఆ వృత్తిలోనే కొనసాగాలని పట్టుబడుతుంది. ఆమెను బలాత్కరించాలని చూసిన ఓ విటుడిని విధిలేని పరిస్థితులలో హతమారుస్తుంది తులసి. ఈ సమయంలో తులసికి శంకర శాస్త్రి అండగా నిలిచి, లాయర్ అయిన తన స్నేహితుడి సాయంతో ఆత్మరక్షణకై చంపినట్లుగా నిరూపించి తులసిని విడిపిస్తాడు.
వేశ్యయైన ఆమెకు ఆశ్రయం ఇవ్వడంతో శంకరశాస్త్రిని అందరూ చులకనగా చూస్తుండేవారు. ఇది తట్టుకోలేని తులసి ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. కాలక్రమంలో పాశ్చాత్య సంగీతపు ఒరవడిలో శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరువై శంకరశాస్త్రి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. తనపై జరిగిన అత్యాచార ఫలితంగా తులసి ఒక కొడుకుకి తల్లి అవుతుంది. అతడిని శంకరశాస్త్రి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి పంపి, శంకర శాస్త్రికి తెలియకుండానే అతనికి ఆర్థికంగా సహాయపడుతుంది. చివరకు శంకరశాస్త్రి పాదాల దగ్గరే ప్రాణాలు విడుస్తుంది.
ఈ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్స్.
Advertisements
Advertisement
- తెలుగులోనే కాదు పక్క రాష్ట్రాలైన తమిళనాడు , కర్ణాటక, కేరళలలో కూడా అఖండ విజయం సాధించింది .
- అమెరికాలో రెగ్యులర్ థియేటర్స్ లో విడుదలైన మొట్టమొదటి చిత్రం ఇదే
- ఈ సినిమా తరువాత ఎంతో మంది శాస్త్రీయ సంగీతం నేర్చుకోవటం మొదలుపెట్టారు
- KVమహదేవన్ సంగీతం, జంధ్యాల మాటలు, వేటూరి పాటలు నభూతో న భవిష్యత్.
హైలెట్ డైలాగ్ :
ఆకలి వేసిన బిడ్డ అమ్మా! అని ఒకలా అరుస్తాడు. నిద్రలో ఉలిక్కిపడి లేచిన బిడ్డ అమ్మా! అని ఒకలా అరుస్తాడు. ప్రతీ శబ్దానికి ఒక ప్రత్యేకమైన శృతి ఉంది, నాదం ఉంది.
శంకర శాస్త్రి పాత్ర:
శంకర శాస్త్రి పాత్రకు మొదట… అక్కినేని నాగేశ్వర్రావ్ లేదా శివాజీ గణేషన్ లను అనుకున్నారు. వారిని కాదని కృష్ణం రాజును సంప్రదించారు. కృష్ణం రాజు ఈ పాత్రను సున్నితంగా తిరస్కరించారు. తర్వాత అప్పటికే నాటకాల్లో మంచి పేరున్న సోమయాజులును శంకర శాస్త్రి పాత్రకు సెలెక్ట్ చేసుకున్నారు.!
Advertisements
అవార్డులు:
- తెలుగులో స్వర్ణకమలం అందుకున్న తొలి తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది.
- ఈ సినిమాలోని గాయకులు అయిన SP.బాలసుబ్రహ్మణ్యం కు ఉత్తమ నేపధ్య గాయకుడిగా తొలిసారి జాతీయ అవార్డు వచ్చింది .
- శ్రీమతి వాణిజయరాంకు ఉత్తమ గాయకురాలు అవార్డ్.
- కె.వి.మహదేవన్ కు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డులు లభించాయి.