Advertisement
1990., డిసెంబరు 07న… ఓ స్టార్ హీరో కొడుకైన అక్కినేని నాగార్జున నటించిన “శివ” సినిమా తెరపైకి వచ్చింది . శివ సినిమా ఎవరో రాంగోపాల్ వర్మ అనే కొత్త దర్శకుడు తీస్తున్నాడు అనే వార్తలు ముందునుంచే ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి . ఎప్పుడైతే శివ పోస్టర్స్ రిలీజ్ చేశారో తెలియకుండానే ఇటు ప్రజల్లో , అటు ఇండస్ట్రీలో ఆసక్తి , ఆశ్చర్యం రెండు మొదలయ్యాయి .
రిలీజ్ మొదటి రోజు మొదటి షో పడింది , సినిమా బృందంతో సహా ప్రతిఒక్కరు ప్రజల అభిప్రాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే సినిమా రిలీజ్ వరకు కూడా చాలా మంది సినీ ప్రముఖులు ఈ సినిమా నడవదు అని చెప్పేసారు , ఒక్క నాగార్జున , రాంగోపాల్ వర్మ తప్ప ఎవ్వరూ ఈ సినిమాని నమ్మలేదు .
సినిమా స్టార్ట్ అయ్యి 15 నిమిషాలు అవుతుంది , ప్రేక్షకులలో ఎటువంటి అలికిడి లేదు . అప్పటివరకు రెగ్యులర్ సినిమాలకు అలవాటు పడిన జనాకు…. ఈ కొత్తరకం స్టోరీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, చిత్రీకరణ ఏదో తెలియని అనుభూతిని తీసుకొస్తున్నాయి. నాగార్జున సైకిల్ చైన్ లాగే సీన్ లో …. థియేటర్స్ అన్నీ విజిల్స్ తో దద్దరిల్లిపోయాయి!
ప్రతిఒక్క స్టూడెంట్ శివ క్యారెక్టర్ లో వాళ్ళని వారు ఊహించుకొనేవారు! బోటని పాఠముంది, మ్యాట్నీ ఆట ఉంది…. అనే పాట 30 ఇయర్స్ అయినా ఇప్పటికీ స్టూడెంట్స్ పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారంటే…. ఆరోజుల్లో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఉంటుందో ఊహించొచ్చు!
సినిమా రిలీజ్ అయ్యాక చాలా సంవత్సరాలు స్టూడెంట్స్ కాలేజీల్లో శివగ్యాంగ్ , భవాని గ్యాంగ్ అంటూ సేపరేట్ గ్యాంగ్ లుగా మెయింటేన్ చేశారు. సైకిల్ చైన్ లు బయట అమ్మడం మొదలు పెట్టారు!
Advertisements
Advertisement
శివ సినిమా…. ఇండస్ట్రీలో తెచ్చిన మార్పులు:
1. శివ సినిమా ఇప్పటికి గుర్తుండిపోడానికి కారణం , కేవలం సక్సెస్ మాత్రమే కాదు , సినిమా మేకింగ్. అప్పటివరకు ఒకే ఫార్మాట్ లో వెళ్తున్న మేకర్స్ కి , లైటింగ్ , స్టడీ కెమెరాలాంటి టెక్నాలజీ పరిచయం చేసింది కాబట్టే శివ ముందు , శివ తర్వాత అనే స్థాయికి వచ్చింది సినిమా మేకింగ్ .
2. అప్పటివరకు హీరో అంటే ఇలానే ఉండాలి అనే నియమాలతో హీరో పాత్రలు ఉండేవి , కానీ రౌడీ ని కూడా హీరో గా చూపించి హీరోయిజం అనే పదానికి నిర్వచనం చూపించింది … శివ పాత్ర .
3. శివ కి ముందు కూడా కాలేజీ బ్యాగ్డ్రాప్ లో రెండు మూడు సినిమాలు వచ్చినా , కాలేజీ లోపల అంశాలు ఇలా ఎవ్వరూ తెరకెక్కించలేదు!
4. అప్పటివరకు సినిమా కథలు అంటే కళ్ళు తడిచిపోయే సెంటిమెంట్ లు , నాలుగు కామెడీలతో సాగిపోయేవి .. శివ తర్వాత రచయితలు అప్పటివరకు రాసుకున్న ఎన్నో కథలని చించి పడేసారు .
5. అప్పటివరకు కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వాలంటే నిర్మాతలు ముందుకు వచ్చేవారు కాదు, కానీ శివ తర్వాత ప్రతిఒక్క కొత్త దర్శకులకు రాంగోపాల్ వర్మ ఒక రెఫరెన్సు గా మారాడు .
6. 30 ఇయర్స్ అవుతున్నా ఇప్పటికి చాలా మంది కొత్త దర్శకులు శివ సినిమాని అందులో సన్నివేశాలను రెఫరెన్సు గా తీసుకుంటున్నారు అంటే అర్థం చేసుకోండి శివ సినిమా ఇండస్ట్రీలో ఎంతటి అద్భుతమో …. కానీ ఏమైందో ఆ ఆర్జీవికి ఇప్పుడు రూటు మారి తన అసలైన దారిని మర్చిపోయేడేమో అనిపిస్తుంది.
Advertisements