Advertisement
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీకి ఏపీలోని శ్రీశైల పుణ్యక్షేత్రంతో చాలా అనుబంధం ఉంది. అవును.. చాలా మందికి ఈ విషయం తెలియదు. 1677వ సంవత్సరంలో అప్పటి గోల్కొండ సుల్తాన్ అబుల్ హసన్ కుతుబ్ షాకు, ఛత్రపతి శివాజీకీ మధ్య చక్కని సంబంధాలు ఉండేవి. దీంతో శివాజీ అప్పట్లో శ్రీశైలం ఆలయాన్ని సందర్శించారు. ఈ క్రమంలో సుల్తాన్ ఆస్థానంలోని అక్కన్న, మాదన్న మంత్రులు శివాజీకి ఆహ్వానం పలికి ఆయన పర్యటన ముగిసే వరకు వారు ఆయనతోనే ఉన్నారు.
అయితే శ్రీశైలంలో భ్రమరాంబ ఆలయంలో శివాజీ తనను తాను దేవికి ఆత్మార్పణం చేసుకోవాలని అనుకున్నాడట. కానీ దేవి ప్రత్యక్షమై అలా చేయవద్దని వారించిందట. అలాగే శివాజీకి ఓ ఖడ్గాన్ని కూడా బహుకరించిందట. దాంతో యుద్దంలో నీకు తిరుగుండదు.. అని శివాజీకి భ్రమరాంబ దేవి చెప్పిందట. అందుకనే శివాజీ ఎంతో మంది రాజులను అలవోకగా జయించారట. ఇక దానికి రుజువు అన్నట్లు ఆలయంలో భ్రమరాంబిక దేవి శివాజీకి ఖడ్గాన్ని బహుకరించే విగ్రహాలను కూడా మనం చూడవచ్చు.
Advertisement
అయితే శ్రీశైలం ఆలయాన్ని శివాజీ తన సొంత ఖర్చుతో అప్పట్లో చాలా అభివృద్ధి చేశారు. ఆయన ఆలయానికి ఉత్తర గోపురాన్ని నిర్మింపజేశారు. అలాగే భక్తుల కోసం కృష్ణానది వద్ద స్నానపు ఘాట్‌లను నిర్మించారు. ఆలయాన్ని పరిరక్షించేందుకు గాను తన సొంత సైనికులు కొందరిని ఆయన శ్రీశైలంలోనే వదిలి వెళ్లారు.
Advertisements
Advertisements
ఛత్రపతి శివాజీకి చెందిన ఓ ఆలయంతోపాటు మ్యూజియం కూడా శ్రీశైలంలో ఉన్నాయి. శ్రీశైలంలో ఆయన చేసిన అభివృద్ధి పనులతోపాటు ఆలయ రక్షణకు ఆయన అందించిన సేవలకు గుర్తుగా శివాజీని ఇప్పటికీ అక్కడి వారు తలచుకుంటారు. ఆలయంలో ఆయనకు పూజలు చేస్తారు. మ్యూజియంలో ఆయన గురించిన వివరాలను భక్తులు తెలుసుకోవచ్చు.