Logical Telugu

One Stop Source for All Your Unanswered Questions - Viral, Human Angle, Myth Busters, Fact Checks

ఒకే యేడాది…ఒకే హీరోకు చెందిన 8 సినిమాలు రిలీజ్ అయితే…? రిలీజ్ అయిన‌వ‌న్నీ హిట్టు కొడితే…? ద‌టీజ్ శోభ‌న్ బాబు.!!

Advertisement

చిన్న చిన్న  క్యారెక్టర్స్  చేసుకుంటూ  సూపర్ స్టార్ స్థాయికి  ఎదిగిన సోగ్గాడు శోభ‌న్ బాబు.! 1975 వ  సంవత్సరం శోభన్ బాబు కెరీర్ కే కాదు తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి కూడా మ‌ర్చిపోలేని సంవ‌త్స‌రం! ఒకే ఏడాది ఒక హీరో న‌టించిన 8 సినిమాలు రిలీజ్ అవ్వ‌డం ., రిలీజ్ అయిన ప్ర‌తి సినిమా హిట్ కొట్ట‌డం ఓ అరుదైన రికార్డ్.! ఈ రికార్డ్ ను శోభ‌న్ బాబు త‌న పేరిట లిఖించుకున్నారు.

shoban babu

Advertisements

రికార్డులే రికార్డ్ లు…….:

Advertisement

  • 1975 లో  శోభన్ బాబువి  మొత్తం 8 సినిమాలు రిలీజ్  అయ్యాయి .  వాటిలో  6 హిట్స్  రెండు యావరేజ్  మూవీస్.
  • 5 సినిమాలు  ఐతే  డైరెక్టర్ గా వందరోజులు  ఆడాయి .అవి  సోగ్గాడు, జీవనజ్యోతి ,  జేబు దొంగ ,  బలిపీఠం , దేవుడు చేసిన పెళ్లి .
  • సోగ్గాడు  17 సెంటర్లలో ,  జీవనజ్యోతి 12 సెంటర్లలో , జేబు దొంగ 10 కేంద్రాల్లో  వందరోజులు ఆడాయి .
  • అలాగే ఒకే సంవత్సరం రిలీజ్ అయిన 8 సినిమాలు 15 కేంద్రాలకు పైగా 50 రోజులు ఆడడం గొప్ప రికార్డ్ .
  • ఆ సంవత్సరం సోగ్గాడు సినిమా సంచలనాలు సృష్టించి కోటి రూపాయలు వసూలు చేసిన నాలుగో తెలుగు చిత్రంగా గుర్తింపు పొందింది.
  • 56 రోజులు కంటిన్యూ గా హౌస్ ఫుల్ అయిన తొలి తెలుగు చిత్రం కూడా సోగ్గాడే!
  • 1975 లో శోభన్ బాబు గారి 8 సినిమాల టోటల్ గ్రాస్ 6 కోట్లకు పైనే
  • ఒకే సంవత్సరంలో వేరువేరు విభిన్న కథలు చేసి న‌ట‌న‌లో సూప‌ర్ స్టార్ అనిపించుకున్నాడు శోభ‌న్ బాబు

Advertisements