Advertisement
సినీ ఇండస్ట్రీ స్టార్ట్ అయిన కొత్తలో డూప్స్ , రోప్స్ ఉండేవి కాదు. అందుకే హీరోలే యాక్షన్ సీన్స్ లో రిస్క్ చేసేవారు ఈ క్రమంలో గాయాలు కూడా అయ్యేవి! తర్వాత టెక్నాలజీ పెరిగడంతో రిస్కీ షాట్స్ ను డూప్ లతో లాగించేస్తున్నారు డైరెక్టర్లు….కానీ ఇప్పుడున్న యంగ్ హీరోలు డూప్ ను యాక్సెప్ట్ చేయకుండా వారే రిస్క్ తీసుకుంటున్నారు. అలా షూటింగ్ చేస్తూ గాయపడిన టాలీవుడ్ హీరోల గురించి ఇప్పుడు చూద్దాం!
1. NTR:
జూనియర్ ఎన్టీఆర్ కు రీసెంట్ గా RRR షూటింగ్ లో ఒక యాక్షన్ సీన్ చేస్తుండగా చేతికి గాయమైందంట… దాంతో రాజమౌళి NTR కి కొద్దిరోజులు రెస్ట్ ఇచ్చారు . ఇటీవల NTR చాలాసార్లు చేతికి కట్టుతో బయటికి రావడం మనం గమనించొచ్చు .
2. రామ్ చరణ్:
Advertisements
రామ్ చరణ్ కూడా RRR షూటింగ్ లో భాగంగా స్టూడియోలో వర్కౌట్ చేస్తున్న సమయంలో తన కాలికి దెబ్బ తగలడంతో చరణ్ కూడా కొద్దిరోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ సెట్స్ లోకి వెళ్ళాడట.
3. నాని:
నాని విక్రం దర్శకత్వంలో చేసిన గ్యాంగ్ లీడర్ షూటింగ్ సమయంలో …. ఫైట్ సీన్స్ చేస్తుండగా కాలికి గాయం అవ్వడంతో కొద్దిరోజులు షూటింగ్ ఆపేశారు . జెర్సీ సినిమా టైంలో కూడా స్టేడియంలో క్రికెట్ అడుతుండగా బాల్ నాని కంటికి తగిలింది.
4. శర్వానంద్:
దిల్ రాజు నిర్మాణంలో తీసిన జానూ మూవీ షూటింగ్ సమయంలో ప్యారాషూట్ తో లాండ్ అయ్యే సీన్ చిత్రికరణలో శర్వానంద్ భుజానికి తీవ్ర గాయమయ్యింది . ఈ వార్త గత సంవత్సరం సంచలనం సృష్టించింది . కొద్ది రోజుల రెస్ట్ తర్వాత మళ్ళీ షూటింగ్లో పాల్గొన్నాడు శర్వానంద్ .
5. విజయ్ దేవరకొండ:
విజయ్ దేవరకొండ కూడా డియర్ కామ్రేడ్ షూటింగ్ లో భాగంగా ట్రైన్ ఎక్కే సీన్ చేస్తుండగా తీవ్రంగా గాయపడ్డాడు . ఈ విషయాన్ని అప్పట్లో తానే స్వయంగా ట్విట్టర్లో తెలిపాడు .
Advertisement
6. నాగశౌర్య:
హీరో నాగశౌర్య ఛలో సినిమా తర్వాత తన సొంత నిర్మాణంలో తీస్తున్న సినిమా షూటింగ్ సమయంలో…. ఒక యాక్షన్ సీన్ తీస్తుండగా గోడ దూకే సీన్ లో తీవ్రంగా గాయపడ్డాడు . కొద్ది రోజుల రెస్ట్ తర్వాత మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేశారు.
7. గోపి చంద్:
గోపిచంద్ చాణక్య సినిమా షూటింగ్ లో భాగంగా రాజస్థాన్ లో యాక్షన్ సీన్ చేస్తుండగా గాయాలయ్యాయి .
8. వరుణ్ తేజ్:
వరుణ్ తేజ్ కూడా ఫారెన్ లో షూట్ చేస్తుండగా షూటింగ్ లో కార్ యాక్సిడెంట్ జరిగి స్వల్పంగా గాయపడ్డాడు .
9. సందీప్ కిషన్:
సందీప్ కిషన్ తెనాలి రామక్రిష్ణ షూటింగ్ సమయంలో ఒక యాక్షన్ సీన్ చేస్తుండగా తీవ్రంగా గాయపడ్డారు . దాంతో చాలారోజుల షూటింగ్ పోస్ట్ పోన్ చేసి తరువాత మళ్ళీ పూర్తిచేశారు .
10 . విశాల్:
హీరో విశాల్ టెంపర్ రీమేక్ తర్వాత తమన్నా హీరోయిన్ గా చేస్తున్న కొత్త సినిమా షూటింగ్ సమయంలో ఫైట్ సీన్ చేస్తుండగా ప్రమాదం జరిగి కాలు , చేయి విరిగాయి. చాలా రోజుల రెస్ట్ తర్వాత ఆ షూటింగ్ మళ్ళీ ప్రారంభించారు .
Advertisements
ఇక పాతకాలం నటులలో నూతన ప్రసాద్ షూటింగ్ లోనే తన కాళ్లను కోల్పోయాడు. చాలా మంది సపోర్టింగ్ నటులు, టెక్నీషియన్స్ ప్రాణాలు సైతం కోల్పోయారు.