Advertisement
హిస్టరీలో కుతుబుద్దీన్ ఐబక్ మరణం గురించి .. అతను పోలో ఆడుతుండగా గుర్రం మీద నుండి కింద పడి చనిపోయాడు అని ఉంటుంది. కానీ దీని మీద అనేక సందేహాలు ఉన్నాయి. కారణం 11 ఏళ్లకే గుర్రపు స్వారీలో ప్రావీణ్యత సంపాదించిన అతను…గుర్రం మీద నుండి కింద పడడం ఏంటి? పడగానే చనిపోవడం ఏంటి? అని…. అయితే ఐబక్ మరణం గురించి ఓ జానపద కథ ప్రచారంలో ఉంది. ఇది భారతదేశ గౌరవాన్ని, మూగ జంతువుల విశ్వాసాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది!
జానపద కథ :
ఓ సారి కుతుబుద్దీన్ ఐబక్…మేవాడ్ రాజైన కర్న సింగ్ పై దండెత్తుతాడు. ఆ యుద్దంలో ఐబక్ కర్న సింగ్ ను ఓడించి అపార ధన రాశులను కొల్లగొడతాడు.. ఈక్రమంలోనే కర్న సింగ్ తో పాటు అతని గుర్రం శుభ్రక్ ను కూడా బందీగా తన వెంట లాహోర్ తీసుకెళతాడు.!
Advertisement
రెండు రోజుల విరామం తర్వాత…. ఐబక్ తన సైనికులకు తన ముందు కర్నసింగ్ తలను మొండెం నుండి వేరు చేయాలని…తనొచ్చి ఆ తలతో…ఆ రాజు గుర్రమైన శుభ్రక్ మీద స్వారీ చేస్తూ పోలో ఆడుతానని అంటాడట!
అన్నట్టుగానే ఐబక్….. కర్న సింగ్ గుర్రం శుభ్రక్ మీద కూర్చొని పోలో ఆడే ప్రదేశానికి వస్తాడట… అతనికి ఎదురుగా కర్నసింగ్, ఆ రాజు పక్కన కత్తులతో ఐబక్ సైనికులు…. పరిస్థితిని గ్రహించిన శుభ్రక్…తన మీద కూర్చున్న ఐబక్ ను కింద పడేసి…తన తలతో ఐబక్ ఛాతీ మీద అదే పనిగా గుద్దిందట…స్పృహ తప్పి పడిపోయిన ఐబక్ చుట్టూ అతని సైనికులు చేరిన క్రమంలో…శుభ్రక్ తన రాజైన కర్న సింగ్ ను ఎక్కించుకొని…… 500 మైళ్లు ఆగకుండా దౌడు తీసిందట…. తన గమ్యస్థానాన్ని చేరుకున్నాక….అక్కడే కుప్పకూలిపోయి మరణించిందట! అలా ఐబక్ మరణానికి కారణం శుభ్రక్ అంటూ జానపద కథలో తన పేరును చిరస్థాయిగా నిలచేలా చేసుకుంది శుభ్రక్.!
Advertisements
Advertisements