Advertisement
ఇప్పుడు చిరంజీవి మెగాస్టార్ కానీ అప్పుడు సైడ్ క్యారెక్టర్ ఇచ్చినా చాలంటూ అనేక ప్రయత్నాలు చేశాడు ….ఇప్పుడు విజయ్ దేవరకొండ పెద్ద హీరో కానీ అప్పుడు గుర్తింపు కూడా లేని ఓ చిన్న పాత్ర చేయడానికైనా ఓకే అన్నాడు.! అలా తమ టాలెంట్ ను నమ్ముకొని ఒక్క ఛాన్సంటూ ఇండస్ట్రీని వదిలిపెట్టకుండా…తమకు అవకాశం రాగానే తమేంటో నిరూపించుకొని ఇప్పుడు సూపర్ స్టార్లు గా ఎదగిన సినీ నటుల గురించి ఇప్పుడు చూద్దాం!
చిరంజీవి:
మెగాస్టార్ చిరు…. కెరీర్ స్టార్టింగ్ లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశాడు. నెగెటివ్ రోల్స్ కూడా కనిపించి తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇది కథ కాదు, బందిపోటు సింహాం, 47 రోజులు, మోసగాడు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ సినిమాల్లో చిరు చేసిన నెగెటివ్ రోల్స్ ఆకట్టుకున్నాయి.
Advertisements
మోహన్ బాబు:
డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న మోహన్ బాబు . 1975 లో స్వర్గం నరకం సినిమా ద్వారా విలన్ గా అరంగేట్రం చేశాడు. అప్పటి స్టార్ హీరోలైన ఎన్టీఆర్ , ఏఎన్ఆర్ ల సినిమాలలో నెగిటివ్ క్యారెక్టర్స్ చేసేవాడు .1990 నాటికి హీరోగా అవకాశాలు దక్కించుకున్నాడు.
రవితేజ:
ఇప్పటి మాస్ మహారాజ గా పిలుచుకుంటున్న రవితేజ తన కెరీర్ మొదట్లో జెడి చక్రవర్తి నిర్మాతగా , హీరోగా చేసిన పాపే నా ప్రాణం అనే సినిమాలో కొన్ని క్షణాలు కనిపించే హోటల్ బాయ్ గా నటించాడ . తర్వాత కె రాఘవేందర్ రావు దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా వచ్చిన అల్లరి ప్రియుడు సినిమాలో హీరో ఫ్రెండ్స్ గ్రూప్ లో ఒకడిగా చేసాడు .
సునీల్:
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో చిన్న పాత్ర చేసిన సునీల్… 2000 సంవత్సరంలో నువ్వే కావాలి సినిమాతో కమెడియన్ మంచి పేరు సంపాదించుకున్నాడు. తర్వాత హీరోగా అనేక సినిమాలు చేశాడు… రాజమౌళి సైతం సునిల్ హీరోగా మర్యాద రామన్న తీసి సూపర్ హిట్ కొట్టాడు.
శ్రీకాంత్:
Advertisement
1990 లో … పీపుల్స్ ఎన్‌కౌంటర్ అనే సినిమాలో సైడ్ క్యారెక్టర్ గా పస్ట్ టైమ్ ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీకాంత్ …. సీతారత్నం గారి అబ్బాయి సినిమాల్లో విలన్ పాత్రలలో కనిపించాడు. అబ్బాయి గారు, దొంగ అల్లుడు, కొండపల్లి రాజా, మరియు రౌడీ అన్నయ్య లాంటి ఇతర సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ గా నటించాడు. వన్ బై టూ సినిమా తో తమ్మారెడ్డి భరద్వాజ్ దర్శకత్వంలో తొలిసారిగా హీరోగా చేసిన శ్రీకాంత్ కు 1995 లో తాజ్ మహల్ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది.
శర్వానంద్:
శర్వా 2004 లో రిలీజ్ అయిన ఐదవ తారీక్ సినిమాతో తన యాక్టింగ్ కెరీర్ ను ప్రారంభించాడు. అమ్మ చెప్పింది సినిమాతో నటుడిగా మంచి పేరు వచ్చినా హీరోగా మాత్రం నిలబడలేక పోయాడు. దీని తరువాత, గౌరీ, శంకర్ దాదా ఎంబిబిఎస్ మరియు సంక్రాంతి చిత్రాలలో సైడ్ క్యారెక్టర్స్ చేసాడు . 2010 లో వచ్చిన ప్రస్థానం సినిమాతో హీరోగా నిలబడ్డ శర్వా తర్వాత మంచి మంచి సినిమాలతో వరుస హిట్లు సాధించాడు.
విజయ్ దేవరకొండ:
2011 లో రిలీజ్ అయిన నువ్విలా అనే సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేసి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన విజయ్… 2012 లో శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో మరో చిన్న పాత్రలో కనిపించాడు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న విజయ్… 2016 లో పెళ్లి చూపులు సినిమాతో హీరోగా సూపర్ హిట్ కొట్టాడు . 2017 లో రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ స్టార్ అయిపోయాడు . ప్రస్తుతం ఈ నటుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ సెట్స్‌లో ఉన్నాడు.
నవీన్ పొలిశెట్టి:
నవీన్ పొలిశెట్టి 2012 లో రిలీజ్ అయిన లైఫ్ ఈస్ బ్యూటీఫుల్ సినిమాలో చిన్న క్యారెక్టర్ తో సినీ కెరీర్ ను స్టార్ట్ చేసిన నవీన్ …. తర్వాత చాలాకాలం కనిపించలేదు! కొంతకాలం యూట్యూబ్ లో స్కెచ్ వీడియోస్ చేసి నార్త్ లో మంచి పేరు సంపాదించాడు . మళ్ళీ 2019 లో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టాడు . ఇతను సుశాంత్ రాజపుత్ నటించిన చిచోరే సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసాడు .
నిఖిల్
ఈటీవీ లో వచ్చే చదరంగం సీరియల్ లో చిన్న క్యారెక్టర్ తో సినీ కెరీర్ ను స్టార్ట్ చేసిన నిఖిల్ ….. నితిన్ సంబరం సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ చేసాడు . శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్…తర్వాత మినిమం గ్యారెంటీ హీరోగా సెటిల్ అయ్యాడు.!
Advertisements