Advertisement
రాముడి జన్మభూమి అయిన అయోధ్యలో … ఆగస్ట్ 5 న ఆలయ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం ముగిసింది. ప్రధాని నరేంద్ర మోడి ప్రత్యేక పూజలు చేసి ఈ వెండి ఇటుకతో భూమి పూజను ప్రారంభించారు.
భూమి పూజకు ఉపయోగించిన ఈ వెండి ఇటుక దాదాపు 22.6 కేజీల బరువు కలిగి ఉందట! దీని ధర 15 లక్షల 59 వేల రూపాయలు! ఈ ఆలయ నిర్మాణానికి మొత్తం 300 కోట్లు వెచ్చించనున్నారు. ఈ నిర్మాణం పూర్తి అవ్వడానికి 3.5 సంవత్సరాల సమయం పడుతుంది!
Advertisement
ఆలయ నిర్మాణానికి సంబంధించిన మరికొన్ని అంశాలు:
- ఈ ఆలయాన్ని 2000 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు.
- రిక్టర్ స్కేల్ పై 10 తీవ్రతతో భూకంపం వచ్చినా కూడా ఆలయం చెక్కుచెదరకుండా ఉండేలా నిర్మాణం.
- నార్త్ ఇండియన్ నగార శైలిలో ఈ ఆలయ నిర్మాణం జరగనుంది!
- ఒకేసారి లక్షకు పైగా భక్తులు సమావేశం అవ్వొచ్చు!
- ప్రముఖ శిల్పి, పద్మశ్రీ అవార్డు గ్రహీత చంద్రకాంత్ సోమ్‌పుర ఈ నిర్మాణానికి అర్కిటెక్ట్ గా వ్యవహారిస్తున్నారు.
- ఈ ఆలయ నిర్మాణం …. 3 అంతస్తులుగా 161 అడుగుల ఎత్తులో జరగనుంది.
Advertisements