Advertisement
రహదారి మీద ఒక వ్యక్తి వాహనంపై ప్రయాణిస్తున్నాడు. అనుకోకుండా యాక్సిడెంట్ జరిగింది. ఆ వ్యక్తి వాహనం మీద నుంచి రోడ్డు మీద పడ్డాడు. తీవ్రగాయాలయ్యాయి. అతను స్పృహ కోల్పోయాడు. చుట్టూ ఉన్న వారు ఆంబులెన్స్‌కు కాల్ చేసి రప్పించారు. ఆంబులెన్స్ వచ్చింది. సిబ్బంది ఆ వ్యక్తిని అందులో చికిత్స నిమిత్తం తరలించారు. అయితే ఆ వ్యక్తి ఎవరు, అతని కుటుంబ సభ్యుల వివరాలు, ఎమర్జెన్సీలో ఎవరికి కాల్ చేయాలి ? అన్న వివరాలు ఎవరికీ తెలియవు. అతని ఫోన్‌ను తీసుకుని చెక్ చేసినా.. అది లాక్ అయి ఉంటుంది కనుక దాని ద్వారా ఆయా వివరాలు తెలియవు. మరి ఇలాంటి సందర్భంలో ఎదురయ్యే ఆ సమస్యకు పరిష్కారం ఏమిటి ? సరిగ్గా మీకు కూడా ఇలాగే జరిగితే ? అప్పుడెలా ? మీ కుటుంబ సభ్యులను ఎవరైనా ఎలా కాంటాక్ట్ చేస్తారు ? అంటే… అందుకు ఉపాయం ఉంది. అదేమిటంటే…
ప్రస్తుతం చాలా మంది దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్లు ఉంటున్నాయి. వాటిల్లో చిన్న సెట్టింగ్స్ చేయడం వల్ల మీ పేరు, బ్లడ్ గ్రూప్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్‌ల వివరాలను మీ ఫోన్ లాక్ స్క్రీన్‌పై కనిపించేలా చేయవచ్చు. అందుకు గాను ఏం చేయాలంటే…
Advertisement
Advertisements
ఫోన్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లి అందులో ఉండే లాక్ స్క్రీన్ అండ్ పాస్‌వర్డ్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తరువాత వచ్చే విండోలో అడ్వాన్స్‌డ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అందులో వచ్చే లాక్ స్క్రీన్ ఓనర్ ఇన్ఫో అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేయాలి. అనంతరం అందులో పైన తెలిపిన విధంగా మీ పేరు, బ్లడ్ గ్రూప్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్‌ల వివరాలను ఎంటర్ చేయవచ్చు. దీంతో మీ ఫోన్ లాక్ అయి ఉన్నా సరే.. దాని లాక్ స్క్రీన్‌పై మీ వివరాలు కనిపిస్తాయి. వాటిని ఇతరులు ఎవరైనా చూసి మీ కుటుంబ సభ్యులకు ఎమర్జెన్సీ సమయాల్లో సమాచారం అందించేందుకు వీలు కలుగుతుంది.
Advertisements
అయితే అన్ని ఫోన్లలోనూ ఈ సెట్టింగ్ ఉంటుందని గ్యారంటీ లేదు. అలాంటి వారు ఏం చేయాలంటే… ఏదైనా ఫొటోను ఎడిట్ చేసి దానిపై పైన తెలిపిన విధంగా సమాచారాన్ని టైప్ చేయాలి. అనంతరం ఆ ఫొటోను సేవ్ చేసి దాన్ని ఫోన్ లాక్ స్క్రీన్‌కు సెట్ చేసుకోవాలి. ఈ క్రమంలో ఆ ఫొటోపై ఆల్రెడీ ఆ సమాచారం ఉంటుంది కనుక లాక్ స్క్రీన్‌పై కూడా కనిపిస్తుంది. దీని వల్ల ఫోన్ లాక్ అయి ఉన్నప్పటికీ ఆ సమాచారాన్ని ఇతరులు తెలుసుకుని ఎమర్జెన్సీ సమయాల్లో మీ కుటుంబ సభ్యులను కాంటాక్ట్ అయి విషయాన్ని తెలియజేస్తారు. ఇలా ఈ సూచన వాహనాల్లో ప్రయాణించే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది.