Advertisement
డిప్రెషన్.. ఈ రోజుల్లో ఐదేళ్ల పిల్లాడి నుండి అరవై ఏళ్ల ముసలి వాళ్ల వరకు కూడా చాలా కామన్ ప్రాబ్లం గా మారిపోయిన జబ్బు..ఎలా మొదలవుతుందో ? ఎక్కడికి తీసుకువెళుతుందో ఎవరికి తెలియదు..దురదృష్టకరమైన విషయం ఏంటి అంటే డిప్రెషన్ కి ఏధైనా బారీ మూల్యం చెల్లించుకున్న తర్వాతే ఆ సమస్య గురించి మాట్లాడాల్సి వస్తుంది..సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో మరోసారి తెరమీదకొచ్చిన అంశం డిప్రషన్. కరోనా అనేది ఇప్పుడు ప్రపంచాన్ని ముంచుతుంది..కానీ డిప్రెషన్ అనేది సైలెంట్ గా మనుషుల్ని కిల్ చేస్తుంది..
డిప్రెషన్ అంటే పర్టిక్యులర్ గా ఇది అని చెప్పలేం.. తీవ్రమైన బాధ..ఒకే విషయానికి పదేపదే బాధపడడం..ఇది మొదట చిన్నగానే ప్రారంభమైనా…అది సమస్యగా గుర్తించేలోపే అనేక మానసిక మరియు శారీరక సమస్యలకు దారితీస్తుంది.. కొన్ని సార్లు చిన్నచిన్న టిప్స్ ద్వారా ఈ డిప్రెషన్ నుండి బయటపడవచ్చు..మరికొన్ని సార్లు సైక్రియాట్రిస్ట్ సాయం తప్పనిసరి..కాబట్టి మీరు చేయగలిగిన కొన్ని టిప్స్ ద్వారా డిప్రెషన్ ను అధిగమించడానికి ప్రయత్నించండి.
Advertisements
డిప్రెషన్ ని అధిగమించడానికి కొన్ని సింపుల్ టిప్స్..
Advertisements
Advertisement
- నిద్ర .. చాలా చాలా ముఖ్యమైనది సరిపడా నిద్ర.. నిద్రలేమి వలనే అనేక సమస్యలు.. కాబట్టి తగినంత నిద్ర పొండి..ఒత్తిడికి గురైనప్పుడు మీ శరీరానికి ఇంకొంచెం ఎక్కువ నిద్ర మరియు విశ్రాంతి అవసరం.
- భోజనం.. టైంకి భోజనం తీసుకోవడం ముఖ్యం.. శరీరానికి సరిపడా వాటర్ తాగడం అనేది రెగ్యులర్ అలవాటుగా చేస్కోవాలి..
- ఇష్టమైన వారితో మాట్లాడడం, కలవడం చేయాలి..ఒకవేళ ఇష్టమైన వారివలన డిస్టర్బ్ అయ్యే పరిస్థితి ఉందంటే మైండ్ ని ఇతర పనుల వైపు మల్లించడం అలవాటు చేస్కోవాలి.
- వ్యాయామం.. యోగా ప్రాక్టీస్ చేయండి, సంగీతం వినండి, ధ్యానం చేయండి, మసాజ్ లేదంటే రిలాక్సేషన్ టెక్నిక్స్ నేర్చుకోండి. సమస్య నుండి బయటకు రావడానికి ఏదో ఒకటి చేయండి…సమస్యలోనే ఉండడానికి ప్రయత్నించొద్దు.
- సోషల్ మీడియాను వీలైనంత దూరం పెట్టడానికి ప్రయత్నించండి.. మనుషుల్లో నిరాశ, నిస్ఫ్రుహలకు కారణం సోషల్ మీడియా అని ఇటీవల అనేక సర్వేల్లో తేలింది..మీ జీవితం నుండి పూర్తిగా తొలగించండి అని చెప్పట్లేదు..లిమిట్ లో ఉంటే బాగుంటుంది.
- ఒక ప్రదేశంలో లేదంటే ఒక వ్యక్తి మూలంగా మీరు ఇబ్బంది పడుతున్నారు..పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది అనిపించినప్పుడు అక్కడ నుండి దూరంగా వెళ్లడానికి ప్రయత్నించండి.. కొద్ది సేపటి తర్వాత పరిస్థితి యధాస్థితికి వస్తుంది..అప్పుడు జరిగింది ఏంటి..జరగాల్సింది ఏంటి అనేదాని గురించి ప్రశాంతంగా కూర్చుని ఆలోచించండి..
- మీరు దేని గురించి బాధపడుతున్నారు/డిప్రెషన్ కి గురౌతున్నారు అనేది ఒక పేపర్ పై పెట్టడానికి ప్రయత్నించండి..పరిష్కారం కూడా మీ చేతుల్లోనే ఉంటుంది..
- పాజిటివ్ థింకింగ్.. మనకు అనుకూలంగా ఉన్నంత వరకు ఒకె..ఏదైనా ప్రతికూలత ఎదురైనప్పుడు మనకు తెలియకుండానే నెగటివ్ ప్రపంచంలో కూరుకుపోతుంటాం..కాబట్టి ఈ ప్రపంచంలో ఏదీ ఫర్ఫెక్ట్ గా ఉండదు,మనుషులు కూడా అనే నిజాన్ని అంగీకరించడానికి ప్రయత్నించండి. పాజిటివ్ థింకింగ్ డిప్రెషన్ కి మంచి మందు..
ఏదైనా సమస్య తొలిరోజుల్లోనే గుర్తిస్తే అధిగమించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది..రోజులు గడుస్తున్న కొద్దీ పెరిగే డిప్రెషన్ కి సైకాలజిస్ట్ సాయం తప్పనిసరి..సైకాలజిస్ట్ దగ్గరకు వెళ్లడానికి చాలామంది ఇబ్బంది పడుతుంటారు..దాన్ని చిన్నతనంగా భావిస్తారు. ఆ ఫీలింగ్ ని వదిలిపెట్టి సైక్రియాటిస్ట్ ని కలిస్తేనే డిప్రెషన్ కి పూర్తిగా చెక్ పెట్టవచ్చు..